నా భర్త మంచోడు, ఏ విషయం నా దగ్గర దాచడు అనుకునేవారు తెలుసుకోవాల్సిన విషయాలు..

-

భార్యా భర్తల మధ్య రిలేషన్ షిప్ అనేది చాలా అత్యున్నతమైనది. ఎందుకంటే, అప్పటి వరకూ ఒక పరిస్థితుల్లో పెరిగిన రెండు జీవితాలు పెళ్ళితో ఒక్కటయ్యి ఇద్దరి జీవితాలని ఒక్కటిగా గడుపుతుంటారు కాబట్టి. ఐతే ప్రస్తుతం విడాకుల సంఖ్య కూడా పెరుగుతుంది అది వేరే విషయం. ఇద్దరు భార్యా భర్తల మధ్య బంధం అనేది పరస్పరం అవగాహన, నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఆ నమ్మకంలో ఏ కొంచెం తేడా వచ్చిన విభేధాలు ఏర్పడి చక్కటి అనుబంధానికి బీటలు ఏర్పడి విడాకుల పేరుతో కోట కూలిపోయే ప్రమాదం ఉంది.

అందుకే సంసారంలో నమ్మకం చాలా ముఖ్యం. అలాగే కొన్ని విషయాలని తెలిసీ తెలియనట్లుగా వదిలేయడం కూడా బంధాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతుంది. ప్రతీదీ తెలుసుకోవాలనీ, ప్రతీదీ చెప్పాలని అనిపించడం కూడా కరెక్ట్ కాదు. ఎక్కువగా మాట్లాడే భర్తలు కూడా కొన్ని విషయాల్లో దాపరికం మెయింటైన్ చేస్తారు. ఆ విషయాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

తమ పాత గర్ల్ ఫ్రెండ్ గురించిన విషయాలని చెప్పకూడదని మగవాళ్ళు అనుకుంటారు. ఒకవేళ వాళ్ళు చెప్పాలనుకున్నా వాటికి అడ్డుకట్ట వేయడం మంచిది. ఎందుకంటే అలాంటి వాటివల్ల మనసు బాధపడి, తీవ్రమైన అనుమానాలకి దారి తీసి అనేక నష్టాలను కలిగిస్తుంది.

ఆర్థికపరమైన విషయాల్లో ప్రతీదీ భార్యకి చెప్పడం కరెక్ట్ కాదని కొందరి వాదన. అలాగే చాలా మంది తమ ఆర్థిక పరిస్థితి గురించి చెప్పరు. వాళ్ళెంత నిజం అందులో కొంత దాయబడి ఉంటుందనేది నిపుణుల వాదన.

భార్యతో రిలేషన్ షిప్ లో ఉంటూ అవతలి వారితో క్రష్ ఏర్పర్చుకునే అబ్బాయిలు ఆ విషయాలు భార్యకి తెలియకుండా మెయింటైన్ చేస్తుంటారు. తెలిస్తే ఎలా ఉంటుందో తెలిసి కూడా అలాంటి అనవసర బంధాలు ఏర్పర్చుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news