హుజూరాబాద్ బైపోల్ : 11 గంటల వరకు 33 శాతం పోలింగ్ నమోదు.

-

దేశవ్యాప్తంగా అందరి ద్రుష్టిని ఆకర్షిస్తున్న హుజూరాబాద్ బై ఎలక్షన్ పోలింగ్ కొనసాగుతోంది. పలు హుజురాబాద్ నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పలు గ్రామాల్లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ 11 గంటల కల్లా ఊపందుకుంది. 11 గంటల వరకు 33.27 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి ఎన్నికల్లో అత్యధిక శాతం పోలింగ్ నమోదవుతుందని అన్ని పార్టీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సమయం ఉండటంతో పోలింగ్ శాతం పెరిగే అశకాశం ఉంది. గతంలో 2018 ఎన్నికల సమయంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో 84.5 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య పెరగడం, ఈ ఉప ఎన్నిక అధిక ప్రాధాన్యం సంతరించుకోవడంతో గతంలో కన్నా అధికంగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో 2,37,036 మంది ఓటర్ల ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 306 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news