హుజూరాబాద్‌ పోరు: కౌశిక్ కాన్ఫిడెన్స్ ఏంటి? ఈటలకే ప్లస్ అవుతుందా?

-

ఇంకా ఉపఎన్నిక షెడ్యూల్ రాకపోయినా సరే హుజూరాబాద్‌ లో రాజకీయం మాత్రం బాగా హాట్ హాట్‌గా నడుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్, హుజూరాబాద్‌లో దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. అటు ఈటలకు మద్ధతుగా తెలంగాణలోని బీజేపీ బడా నేతలంతా హుజూరాబాద్‌లో ప్రచారం మొదలుపెట్టారు. ఇంకా అభ్యర్ధిని డిసైడ్ చేయకపోయినా సరే కారు గుర్తుకే ఓట్లు వేయాలని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూరాబాద్‌లో ప్రతి ఇంటికి వెళుతున్నారు.

హుజూరాబాద్‌ పోరుఅయితే హుజూరాబాద్‌లో ఈటల-టీఆర్ఎస్‌ల మధ్యే ప్రధాన పోరు ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఇక్కడ కాంగ్రెస్‌కు గెలిచేందుకు పెద్ద స్కోప్ ఉండదని విశ్లేషకులు అంటున్నారు. అయినా సరే కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతున్న కౌశిక్ రెడ్డి మాత్రం తన గెలుపుపై బాగా ధీమాగా ఉన్నారు. ఇప్పటికే కౌశిక్ రెడ్డి హుజూరాబాద్‌లో ప్రచారం మొదలుపెట్టారు. పైగా ఇక్కడ టీఆర్ఎస్-కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోరు ఉంటుందని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.

అంటే హుజూరాబాద్‌లో ఈటలకు అంత సీన్ లేదని పరోక్షంగా చెబుతున్నారు. అయితే కౌశిక్‌ది కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంటున్నారు. అసలు కౌశిక్ ఇక్కడ సత్తా చాటడం కష్టమే అంటున్నారు. ఎందుకంటే హుజూరాబాద్‌లో బీజేపీకి బలం లేకపోయిన సరే ఈటలకు బలం ఉంది. ఇప్పుడు ఆ బలాన్ని నమ్ముకుంటే ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బరిలో దిగారు.

కాకపోతే కౌశిక్ కొంతవరకు ఓట్లు చీలుస్తారని తెలుస్తోంది. ఆ ఓట్లు చీలడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుందనేది అర్ధం కాకుండా ఉంది. అయితే ఈ మధ్య కౌశిక్, మంత్రి కేటీఆర్‌ని కలిశారు. దీని బట్టి చూస్తే కౌశిక్ కాంగ్రెస్ నుంచే బరిలో ఉన్నా, పరోక్షంగా టీఆర్ఎస్‌కు సాయం చేస్తున్నారని హుజూరాబాద్ ప్రజలకు అర్ధమైతే ఈటలకే బెన్‌ఫిట్ అవుతుంది. మరి చూడాలి హుజూరాబాద్‌లో కౌశిక్ ఏ మేర సత్తా చాటుతారో?

Read more RELATED
Recommended to you

Latest news