HYD : ఈనెల 23న ఉస్మానియా క్యాంపస్‌లో జాబ్ మేళా

-

రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఏటా లక్షల సంఖ్యలో బీటెక్ గ్రాడ్యుయేట్లు, డిగ్రీ స్టూడెంట్స్, పోస్టు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ తమ సర్టిఫికెట్స్ చేత బట్టుకుని ఇంటర్వ్యూల కోసం కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు.చివరకు ఏ ఉద్యోగం దొరకని వారు చివరగా క్యాబ్ డ్రైవర్స్, డెలివరీ పార్ట్నర్‌గా పనిచేస్తున్నారు.మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యంగా ఏళ్ల తరబడి ప్రిపరేషన్ చేస్తూనే ఉన్నారు.అయితే, చదువుకున్న సంఖ్య క్రమంగా పెరిగిపోతూ ఉండటం, ఉద్యోగాలు డిమాండ్‌కు తగినన్నీ లేకపోవడంతో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోంది.

ఈ క్రమంలోనే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరోలో ఈనెల 23న నిర్వహించే జాబ్ మేళాకు హాజరు కావాలని.. యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్, గైడెన్స్ బ్యూరో డిప్యూటీ చీఫ్ అధికారి రాము పేర్కొన్నారు. ఐటీఐ డీజిల్ మెకానిక్, డిప్లామా మెకానికల్, డిగ్రీ, పీజీ, బీటెక్ పూర్తి చేసిన వారు ఉదయం 11 గంటల వరకు జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version