హైదరాబాద్ మహానగరంపై కరోనా పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. నిత్యం వంద కొద్దీ కేసులు కేవలం నగర పరిధిలోనే నమోదవుతుండడం కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో రెండు, మూడు వారాల్లో కేసులు ఇంకా భారీ సంఖ్యలో నమోదయ్యే అవకాశం ఉన్నందున కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో జనాలు అస్సలు బయటకు రాకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒక వేళ వచ్చిన కచ్చితంగా మాస్కులు ధరించాలని, కరోనా రాకుండా ఉండేందుకు అవసరం అయిన అన్ని జాగ్రత్త చర్యలను తీసుకోవాలని అంటున్నారు. ప్రజలు స్వీయరక్షణ పాటించాలని, సెల్ప్ లాక్‌డౌన్‌లో ఉండాలని అంటున్నారు. కొందరికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా బయట పడుతుందని, కనుక ప్రజలు కరోనా పట్ల ఏమాత్రం అజాగ్రత్తగా ఉండరాదని అంటున్నారు.
ఇక జనాలు మరో నెల రోజుల వరకు బయట తిరగకూడదని, సభలు, సమావేశాలు, ఇతర ఏ ముఖ్యమైన కార్యాలు ఉన్నా సరే వెళ్లకూడదని అంటున్నారు. కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని, మాస్కులను ధరించాలని అంటున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, కనుక జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.