BREAKING : హైదరాబాద్ అర్థరాత్రి రేవ్ పార్టీ..మెగాడాటర్ నిహారిక అరెస్ట్ ?

-

హైదరాబాద్‌ మహానగరంలోని పబ్‌ లపై నిన్న రాత్రి పోలీసులు వరుసగా దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే.. నిన్న నగరంలో నిర్వహించిన రేవ్‌ పార్టీని కూడా పోలీసులు భగ్నం చేసినట్లు తెలుస్తోంది. రాడిసన్‌ బ్లూ హోటల్‌ పై టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు ఒక్క సారిగా దాడులు చేశారు.

హోటల్ లో ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్ అర్దరాత్రి దాటినా సమయానికి మించి పబ్ నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు… యజమానులతో సహా సుమారు 150మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక అరెస్టు ఆ 150 మందిని బంజారాహిల్స్ పీఎస్ కి తరలించారు పోలీసులు.

రాత్రి 3 గంటల సమయంలో దాడులు నిర్వహించిన పోలీసులు… వారిని అరెస్టు చేశారు. అయితే పోలీసుల అదుపులోకి టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో పాటు మెగా డాటర్‌ నిహారిక కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. అలాగే.. నిర్వాహకులు అభిషేక్‌ ఉప్పల్‌, అనిల్‌ కుమార్‌ లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news