ఈ వేసవి లో ఏదైనా టూర్ వెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే ఈ టూర్ ప్యాకేజీ ని చూడాల్సిందే. ఇండియన్ రైల్వే కేటింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రయాణికుల కోసం సూపర్ ప్యాకేజీలని తీసుకు వస్తోంది. ఈ ప్యాకేజీల తో చక్కగా అన్ని ప్రదేశాలు చూసి రావచ్చు. ఇండియన్ రైల్వే కేటింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గంగా రామాయణ్ యాత్ర పేరుతో ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. రామాయణ్ యాత్ర పేరుతో హైదరాబాద్ నుంచి కాశీకి ఈ ప్యాకేజీ ని ఇస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. 5 రాత్రులు, 6 రోజులుగా ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది.
జూన్ 7వ తేదీన అందుబాటులో వుంది ఈ ప్యాకేజీ. ఇక ఈ టూర్ ఎలా సాగుతుందనేది చూస్తే…. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్లైట్ ఉదయం 9.30 గంటలకు బయలుదేరి వెళ్ళాలి. వారణాసి విమానాశ్రయానికి ఉదయం 11.25 గంటలకు చేరుకుంటారు. ఆ తరవాత హోటల్‌లో చెకిన్ అవ్వాల్సి వుంది. భోజనం తర్వాత కాశీ దేవాలయం, గంగా ఘాట్, సందర్శన ఉంటుంది. రాత్రి వారణాసిలోనే ఉండాలి. రెండో రోజు సారనాథ్ ఉంటుంది.
మధ్యాహ్నం తిరిగి వారణాసికి రీచ్ అవుతారు. ఆ తరవాత బిర్లా ఆలయం చూడచ్చు. టైం ఉంటుంది ఘాట్‌లను చూడచ్చు. షాపింగ్ చెయ్యచ్చు. భోజనం తర్వాత రాత్రి వారణాసిలో ఉండాలి. మూడో రోజు అయోధ్యకు బయలుదేరాల్సి ఉంటుంది. ఆనంద్ భవన్, అలోపి దేవి ఆలయం, త్రివేణి సంగమం మధ్య లో చూడవచ్చు. అయోధ్యలో బస ఉంటుంది. నాలుగలో రోజు ఉదయం అయోధ్య ఆలయాన్ని చూసి… మధ్యాహ్నానికి హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి లక్నోకి స్టార్ట్ అవ్వాలి.
అక్కడ హోటల్‌లో రాత్రి బస ఉంటుంది. 5వ రోజు నైమిశరణ్యాన్ని దర్శనం ఉంటుంది. అది ముగించుకున్నాక సాయంత్రం తిరిగి లక్నో రావాల్సి వుంది. బారా ఇమాంబరా, అంబేద్కర్ మెమోరియల్ పార్క్‌ని లాస్ట్ చూడచ్చు. సాయంత్రం 6 గంటలకు లక్నో విమానాశ్రయంలో ఫ్లైట్. అక్కడ నుంచి రాత్రి 8:00 వరకు హైదరాబాద్ వస్తారు. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ. 36,850 చెల్లించాల్సి వుంది. అదే ఇద్దరు వెళ్తుంటే ఒక్కొక్కరు రూ.29,900, ముగ్గురు వ్యక్తులు అయితే రూ.28,200.