ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని, వారికి నెక్స్ట్ టికెట్ ఇస్తే గెలుపు కష్టమని ప్రశాంత్ కిషోర్ టీం..కేసీఆర్ కు రిపోర్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు…అయితే కొందరు ఎంత చేసిన ప్రజల్లో వ్యతిరేకత మాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది…కొందరు ఎమ్మెల్యేలతో ప్రజలు బాగా విసిగిపోయారని తెలుస్తోంది…అలాంటి ఎమ్మెల్యేలు నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడం కష్టమే అని తెలుస్తోంది.
ముఖ్యంగా వరుసగా రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగానే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది…అలా వ్యతిరేకతని మూటగట్టుకున్న వారిలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా ఉన్నారని విశ్లేషణలు వస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో వరుసగా గువ్వల టీఆర్ఎస్ నుంచి గెలిచారు…ఇలా రెండు సార్లు గెలిచి..రెండు సార్లు అధికార ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సరే…అచ్చంపేటలో గువ్వల చేసిన అభివృద్ధి శూన్యమని తెలుస్తోంది.
నియోజకవర్గంలో అభివృద్ధి తక్కువ అని ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని తెలుస్తోంది. పైగా వలస బిడ్డని అని చెప్పుకుని గువ్వల కోట్లకు ఎలా పడగెత్తారో చెప్పాలని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. నియోజకవర్గంలో గువ్వల అనుచరుల అక్రమాలు ఎక్కువే అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇలా గువ్వలకు అచ్చంపేటలో మైనస్ పెరుగుతుంది. గత ఎన్నికల్లో అంటే కేసీఆర్ గాలిలో గువ్వల విజయం సాధించారని, కానీ ఈ సారి కేసీఆర్ గాలి తక్కువ అని, పైగా గువ్వలపై వ్యతిరేకత ఎక్కువ ఉందని, నెక్స్ట్ ఆయన గెలుపు కష్టమని ప్రచారం జరుగుతుంది.
ఇదే సమయంలో అచ్చంపేటలో కాంగ్రెస్ బలపడినట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన పలు సర్వేల్లో కాంగ్రెస్ పుంజుకున్నట్లు తేలింది. ఇక్కడ కాంగ్రెస్ ఇంచార్జ్ వంశీకృష్ణ దూకుడుగా పనిచేస్తున్నారు…పైగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్ది సైతం అచ్చంపేటపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎలాగైనా గువ్వలకు చెక్ పెట్టాలని అనుకుంటున్నారు. ఈ మధ్య వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో అచ్చంపేట సీటు కాంగ్రెస్ కు దక్కుతుందని తేలింది. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో గువ్వల బాలరాజు గెలుపు గగనమే.