ఈత కొట్టేందుకు వెళ్లి.. హైదరాబాద్ యువకులు గల్లంతు..!!

-

సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన సంభవించింది. సిద్దిపేటలోని కొండపోచమ్మ జలాశయంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. జలాశయంలో ఈత కోసం దిగిన ఆ యువకులు.. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగారు. దీంతో వారిద్దరు గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టారు. ఆ అరుపులు విన్న స్థానికులు పరుగెత్తుకుని రాగా.. అప్పటికే వారిద్దరు నీట మునిగారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ఈత-ప్రమాదం
ఈత-ప్రమాదం

అయితే, జలాశయంలో గల్లంతైన యువకులు హైదరబాద్ నగరానికి చెందిన వారని.. అక్షయ్ వెంకట్ (28), రాజన్ శర్మ (28)లుగా పోలీసులు తెలిపారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news