హైడ్రా కూల్చివేతలు.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గ్రేటర్ పరిధిలోని రోడ్లు, చెరువులు, ప్రభుత్వ భూములు తదితర ప్రాంతాలను కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన ఇండ్లను కూల్చివేస్తున్నారు. తాజాగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మాదాపూర్ లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సున్నపు చెరువు వద్ద అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. నిర్మాణాలకు చెందిన యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అధికారులు మాత్రం వెనక్కి తగ్గలేదు.

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని ఆందోళనకు దిగారు. కూల్చివేతలు ఆపాలంటూ ఐదుగురు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమ కూల్చివేస్తే.. ఒంటికి నిప్పంటించుకొని తగులబెట్టుకుంటామని అధికారులను హెచ్చరిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచే హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. సున్నం చెరువు దాదాపు 26 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ చెరువు చాలా కాలంగా కబ్జాలకు గురవుతోంది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని సర్వే నెంబర్ 13, 14, 16 గా ఉన్నట్టు నిర్థారించింది. ఆ సర్వే నెంబర్లలోనే బఫర్ జోన్లున్నాయి. పక్కా ఆధారాలతోనే అధికారులు కూల్చివేతలను ప్రారంభించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version