ఇటీవలి కాలంలో సెలబ్రెటీల అనారోగ్య పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా తమ హెల్త్ ఇష్యూలను బయటపెడుతున్నారు. తాజాగా ప్రముఖ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. తను కొన్నాళ్లుగా గుండె, ఇతర సమస్యలతో బాధపడుతున్నానని.. తనను దగ్గరగా చూస్తున్నా వారికి ఈ విషయం గురించి తెలుసని చెప్పారు.
ఇంస్టాగ్రామ్ లో తన ఫోటోని షేర్ చేస్తూ.. ” శ్రేయోభిలాషులారా మీకో విషయం చెప్పాలనుకుంటున్నా. నేను గత కొన్ని లుగా గుండె, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. వాటిని ఎదుర్కొనేందుకు చాలా కష్టపడుతున్నాను. నేను మాత్రమే కాదు నాలా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బలంగా ఉండాలని, వారిలో సానుకూల దృక్పథం నింపేందుకు ఇప్పుడు ఈ పోస్ట్ చేస్తున్నాను. జీవితంలో ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా సరే వాటిని నవ్వుతూ ఎదుర్కోవాలి. నాకు ఇప్పుడు చికిత్స జరుగుతుంది. మెడిసిన్స్ తీసుకుంటున్నాను. త్వరలోనే మళ్లీ మామూలు మనిషిలా తిరిగి వస్తాను” అని తెలిపారు.
https://www.instagram.com/reel/ComPPXKI7EY/?utm_source=ig_web_copy_link