నేపాల్‌ వెళ్లాలని ఉందా..? అయితే అదిరే ఆఫర్ మీకోసం..!

-

మీరు నేపాల్ వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే ఈ టూర్ ప్యాకేజీని చూడాల్సిందే. IRCTC వివిధ టూర్ ప్యాకేజీలని తీసుకు వచ్చింది. మన దేశంలో, పొరుగు దేశాల్లో చాలా ఆలయాలు వున్నాయి. ప్రసిద్ధి ఆలయాల్లో పశుపతినాథ్ దేవాలయం కూడా ఒకటి.

నేపాల్ రాజధాని ఖాట్మండులోని పశుపతినాథ్ దేవాలయం ని చూసేందుకు చాలా మంది వెళ్తూ వుంటారు. ఇక్కడకి వెళ్లాలంటే మార్చి నెలలో మీ కుటుంబంతో కలిసి వెళ్ళచ్చు. IRCTC నేపాల్ టూర్ ద్వారా మీరు ఢిల్లీ నుండి ఖాట్మండు విమానం లో వెళ్ళచ్చు. ఇక ఇప్పుడు ఈ ప్యాకేజీ వివరాలని చూసేద్దాం. మార్చి 30న ఈ టూర్ స్టార్ట్ అవుతుంది.

ఢిల్లీ నుండి ఖాట్మండుకు వెళ్ళచ్చు. 6 పగళ్లు, 5 రాత్రులు టూర్ ప్యాకేజీ ఇది. ఖాట్మండుతో పాటు, పోఖారాను కూడా చూడచ్చు. ఈ ప్యాకేజీ లో ఖాట్మండు లోని పశుపతినాథ్ ఆలయంతో పాటు దర్బార్ స్క్వేర్, స్వయంభూనాథ్ స్థూపం వంటి ప్రదేశాలు కూడా వున్నాయి. కనుక ప్రయాణికులు వీటిని కూడా సందర్శించవచ్చు. ఇక ఈ ప్యాకేజీ ధర విషయానికి వస్తే.. ఒక్కరు టూర్ కు వెళ్లాలంటే రూ.40,000 ఖర్చవుతుంది. ఇద్దరికి రూ.31,000, ముగ్గురు వ్యక్తులు కూడా ఒక్కొక్కరికి రూ.31,000 ఇద్దరికి ఖర్చు అవుతుంది. పూర్తి వివరాలని IRCTC వెబ్ సైట్ లో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news