ప్రముఖ సంగీత దర్శకుడు కోటి గురించి..ఆయన సంగీతం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ముఖ్యంగా రాజ్ తో కలిసి ఈయన కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయని చెప్పాలి. ఇకపోతే సాలూరి రాజేశ్వరరావు గారి తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన సాలూరి కోటేశ్వరరావు గా తన తల్లిదండ్రులు పేరు పెట్టినప్పటికీ కోటిగా పేరును మార్చుకున్నాడు. ముఖ్యంగా ఎన్నో సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ అందించారు. ఇకపోతే రాజ్ అలాగే కోటీ ఇద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ కొన్ని కారణాల వల్ల విడిపోయి ఎవరికి వారు సొంతంగా మ్యూజిక్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇక ఆ సమయంలో హిట్లర్, హలో బ్రదర్ ,బంగారు బుల్లోడు వంటి హిట్ చిత్రాలు కోటి సొంతమయ్యాయి. ఇక చిరంజీవి కాంబినేషన్లో సుమారు 11 సినిమాలు చేసి హిట్ కొట్టిన కోటి గారికి చిన్న చిన్న మనస్పర్ధలు కారణంగా చిరంజీవి గారికి దూరం పెరిగింది.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కోటి బాలకృష్ణతో సినిమా వల్లే పూర్తిగా నష్టపోయాను అంటూ వెల్లడించారు. మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో సినిమా డిస్ట్రిబ్యూషన్ వైపు వెళ్లాలని అనిపించి, బాలకృష్ణ హీరోగా..కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన మంగమ్మగారి మనవడు సినిమాకు నెల్లూరు జిల్లా డిస్ట్రిబ్యూషన్ గా తీసుకున్నాను. ఇక సంగీత దర్శకుడిని కూడా ఈ సినిమాకు నేనే కావడంతో సినిమా పై ఎన్నో అంచనాలను పెట్టుకున్నాను. అలా భారీ అంచనాల మధ్య విడుదల అయినా ఈ సినిమా పూర్తిస్థాయిలో డిజాస్టర్ అయింది .దీంతో పెట్టిన డబ్బులు మొత్తం పోయాయి. మళ్ళీ ఇంకో వ్యాపారం మొదలుపెట్టినా అప్పుడు కూడా అలాగే జరిగింది..
బాలయ్య సినిమాతో పూర్తిగా నష్టపోయిన తర్వాత మళ్లీ మ్యూజిక్ రంగానికి పరిమితమయ్యాను. ఇక దేవుడు నీకు మ్యూజిక్ చేసుకునే అవకాశం ఇచ్చాను అది మాత్రమే చేసుకో.. మరే దాంట్లో వేలు పెట్టకు అంటూ చెప్పినట్లు అనిపించింది. అందుకే ఇంకో వ్యాపారం జోలికి వెళ్లలేదు అంటూ ఆయన స్పష్టం చేశారు.