కేంద్ర ప్రభుత్వం బంగారం ప్రియులకు శుభవార్త చెప్పింది.. దేశీయ సాంప్రదాయంలో మహిళలకు బంగారానికి అధికంగా విలువ ఇస్తారన్న విషయం తెలిసిందే. అయితే బంగారం ధరల విషయానికొస్తే దేశంలో అన్ని ప్రాంతాల్లో రేటు ఒకేటా ఉండదని, కొన్ని రాష్ట్రాల్లో ఎక్కవ రేటు ఉంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో తక్కువ రేటు ఉంటుందన్నారు. అందుకు కారణం ఏంటంటే.. రవాణా ఛార్జీల్లో తేడా ఉండట వల్ల ప్రాంతాలను బట్టి ధర మారుతూ ఉంటుంది. ఇక దేశ వ్యాప్తంగా ఒకే బంగారం ధరను అందుబాటులోకి తీసుకురానుంది కేంద్రం. ఈ స్కీమ్ అమలైతే బంగారం కొనుగోళ్లు మరింతగా ఊపందుకోనున్నాయి. బులియన్ ఎక్స్ఛేంజ్ ప్రారంభంతో నగల వ్యాపారులు ఇప్పుడు అంతర్జాతీయ ధరలకు బంగారం కొనుగోలు చేసే సదుపాయాన్ని పొందుతారని, వారు ఎటువంటి రవాణా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదని కేంద్రం పేర్కొంది. రవాణా ఛార్జీలు విధించడం వల్ల వివిధ రాష్ట్రాల్లో బంగారం ధర మారుతుందని, ఈ విధానం అమలైతే ఎక్కవ ధరకు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదని కేంద్రం తెలిపింది.
ఈ సమస్య త్వరలో తొలగిపోనుందని, అంతర్జాతీయ బులియన్ ఎక్స్ఛేంజ్‌కు ధన్యవాదాలు చెప్పవచ్చని కేంద్రం వెల్లడించింది. ఎందుకంటే దేశంలో వన్ గోల్డ్ వన్ రేట్ పథకాన్ని అమలు చేస్తే ఎంతో ప్రయోజనం చేకూరనుందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలో వన్ గోల్డ్ వన్ రేట్ పథకాన్ని అమలు చేయాలనే డిమాండ్ పాతదే. ఎందుకంటే అదే బంగారాన్ని ఆగ్రాలో వేరే ధరకు, భోపాల్‌లో వేరే ధరకు విక్రయిస్తారు. తమిళనాడు నుండి జమ్మూ కాశ్మీర్ వరకు బంగారం ధరలో తేడాను గమనించవచ్చు. అయితే బంగారం అలాగే ఉంటుంది. స్వచ్ఛత కొలమానం కూడా అదే. ఎందుకంటే బంగారాన్ని దిగుమతి చేసుకుని ల్యాండ్ అయ్యే పోర్టు అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు పంపిస్తారని కేంద్రం తెలిపింది.