క్రికెట్ ప్రేమికులకు అలర్ట్: జూన్ 1 నుండి ఐసీసీ కొత్త రూల్స్…క్రికెట్ ప్రేమికులకు అలర్ట్: జూన్ 1 నుండి ఐసీసీ కొత్త రూల్స్…అంతర్జాతీయ క్రికెట్ ను సక్రమంగా నడిపిస్తూ ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ను ఆదరించే, అభిమానించే వారు ఎక్కువ కావడానికి ప్రధాన కారణం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని చెప్పాలి. ఎప్పటికప్పుడు ప్రేక్షకులు సంతోషపడే విధంగా క్రికెట్ లో మార్పులు తెస్తూ ఆకట్టుకుంటోంది, కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఐసీసీ మరికొన్ని కొత్త నియమ నిబంధనలను రూల్ బుక్ లోకి చేర్చనుంది. కొత్తగా రానున్న రూల్స్ లో చూస్తే సాఫ్ట్ సిగ్నల్ రూల్ ను పూర్తిగా తొలగించనున్నది. ఇంతకు ముందు యంపైర్ కు అర్ధం కాని నిర్ణయాలను థర్డ్ అంపైర్ కు అప్పీల్ చేసుకుంటూ తన అభిప్రాయాన్ని సాఫ్ట్ సిగ్నల్ ద్వారా తెలియచేసేవారు. కానీ ఇకపై ఈ రూల్ ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లుగా ఐసీసీ ప్రకటించింది. ఇక హై రిస్క్ ఉన్న సమయంలో ఆటగాళ్లు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలన్న నిబంధనను తీసుకువచ్చింది.
ఇక ఇంతకు ముందు వరకు ఫ్రీ హిట్ సమయంలో బౌలర్ బ్యాట్స్మన్ ను బౌల్డ్ చేస్తే ఆ బంతి అలాగే బౌండరీకి వెళ్లినా లేదా పరుగులు తీసినా పరిగణలోకి తీసుకునే వారు కాదు. కానీ కొత్త రూల్ ప్రకారం ఫ్రీ హిట్ లో బౌల్డ్ అయినా పరుగులు తీస్తే యంపైర్ లెక్కిస్తారు. ఇలా కొత్త రూల్స్ అన్నీ కూడా జూన్ 1 నుండి అమలులోకి రానున్నాయి.