ఎంసెట్‌ విద్యార్థులకు అలర్ట్‌.. ప్రాథమిక కీ విడుదల

-

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రాథమిక కీ విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన వివిధ సెంటర్లలో నిర్వహించిన ఎంసెట్‌ పరీక్షలు ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం రాత్రి 8గంటలకు EAMCET 2023 (ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌) పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేసింది. ఈ నెల 12 నుంచి మూడు రోజుల పాటు ఆరు విడతల్లో నిర్వహించిన ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల రెస్పాన్స్‌ పత్రాలను సైతం వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ ప్రాథమిక కీపై ఈ నెల 17 రాత్రి 8గంటల వరకు అభ్యంతరాలను పంపొచ్చని అధికారులు సూచించారు. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షకు మొత్తం 2,05,351 మంది దరఖాస్తులు చేసుకోగా.. 1,95,275మంది(94.11శాతం) పరీక్షలు రాసినట్టు ఎంసెట్‌ కన్వీనర్‌ కార్యాలయం వెల్లడించింది.

TS EAMCET final phase of counselling likely to begin in last week of October

తెలంగాణలో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ఎంసెట్ పరీక్షను ఈ నెల 12, 13, 14 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించారు. విద్యార్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫైనల్ కీని విడుదల చేయనున్నారు. అనంతరం ఫలితాలు విడుదల అవుతాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరులోగా ఎంసెట్ ఫలితాలను విడుదల చేయాలన్నది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. ఈ సారి ఎంసెట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ కు మొత్తం 2, 05,351 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,95,275 మంది హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news