ఐపీఎల్ లో నేడు మొదట టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఎంచుకుని అద్భుతమైన బ్యాటింగ్ పెర్ఫార్మన్స్ ను చూపించింది. ఓపెనర్ గా వచ్చిన గిల్ చివరి వరకు అవుట్ అవ్వకుండా ఎంతో సంయమనంతో ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డును ఎక్కడా పడిపోకుండా చూసుకుంటూ బాధ్యతాయుతంగా ఆడాడు. ఇతనికి వన్ డౌన్ బ్యాట్స్మన్ సుదర్శన్ (47) దగ్గర నుండి చక్కని సహకారం లభించింది. మధ్యలో హార్దిక్ (8) , మిల్లర్ (7) మరియు తేవాతియా లు పరుగులు చేయడంలో అవుట్ అయ్యారు. కానీ గిల్ మాత్రం ఒకవైపు వికెట్లు పడుతున్నా చివరి ఓవర్ వరకు నిలబడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించి మరో అయిదు బంతులు మిగిలి ఉన్న సమయంలో భువి బౌలింగ్ లో సమద్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
అయితే ఈ ఇన్నింగ్స్ లో గిల్ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించడం విశేషం. గిల్ కు ఐపీఎల్ కెరీర్ లో ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం. మొత్తం బంతులు ఆడిన గిల్ 13 ఫోర్లు మరియు 1 సిక్సు సహాయంతో 101 పరుగులు చేశాడు.