సీనియర్ సిటిజన్లకు ఐసిఐసిఐ బ్యాంక్ గుడ్ న్యూస్..

-

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎప్పటికప్పుడు తన కస్టమర్లకు కొత్త అవకాశాలను అందిస్తుంది.ఈ మేరకు తాజాగా మరో గుడ్ న్యూస్ ను చెప్పింది..సీనియర్ సీనియర్ సిటిజన్ల కోసం ప్రారంభించిన ఈ ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకం రేటు పెంచారు. కొత్త రేట్లు 21 మే 2022 నుండి అమలులోకి వచ్చాయి. ఈ ప్రత్యేక FD పథకంలో సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ ఇస్తారు. FDలో కూడా సీనియర్ సిటిజన్లు సాధారణ డిపాజిటర్ కంటే ఎక్కువ వడ్డీని పొందుతారు.

గోల్డెన్ ఇయర్ FD పథకం సీనియర్ సిటిజన్ FD పథకం కంటే ఎక్కువ వడ్డీ పొందుతారు. గత ఏడాది 20 మే 2020న ప్రారంభమైన ఈ పథకం రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తంలో డిపాజిట్ చేసిన వారికి వర్తిస్తుంది. గోల్డెన్ ఇయర్ ఎఫ్‌డి పథకంలో సీనియర్ సిటిజన్లకు 6.35 శాతం వడ్డీ ఇవ్వగా, ఇప్పుడు దానిని 6.50 శాతానికి పెంచారు. కాగా,గోల్డెన్ ఇయర్ ఎఫ్‌డి పథకం కింద, ఐసిఐసిఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్‌లకు ప్రస్తుతం ఉన్న సంవత్సరానికి 0.50 శాతం అదనపు వడ్డీకి అదనంగా 0.25 శాతం ఎక్కువ వడ్డీని ఇస్తుంది.

ఈ పథకంలో సీనియర్ సిటిజన్లు కనీసం 5 సంవత్సరాల 10 సంవత్సరాల ప్రత్యేక FD పథకాన్ని ప్రారంభించవచ్చు.2 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకోవచ్చు.వడ్డీ రేట్లను పెంచిన తర్వాత, కొత్త రేటు ప్రయోజనం పాత ఖాతా, కొత్త ఖాతా రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. ఇంతకుముందు ఈ పథకం 8 ఏప్రిల్ 2022 వరకు అందుబాటులో ఉంది.అయితే ఇప్పుడు దీనిని పొడిగిస్తున్నట్లు బ్యాంక్ అధికారుల అధికారికంగా ప్రకటనలో పేర్కొన్నారు.. ఇది సీనియర్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి..ఇలాంటి మరెన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొస్తామని బ్యాంక్ మేనేజర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news