మొత్తం వారే చేస్తున్నారు ? జగన్ అభాసుపాలు అయ్యేది ఇందుకా ?

-

రాజకీయంగా అన్ని విషయాల్లోనూ పై చేయి సాధిస్తున్నా, జగన్ ప్రభుత్వం మిగతా విషయాలు అభాసుపాలు అవుతూ వస్తోంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై న్యాయస్థానాల్లో కేసులు దాఖలు అవడం, వాటిని కోర్టులు తప్పుపట్టడం ఇలాంటి వ్యవహారాలు ఎన్నో నడుస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇది అలవాటు గానే మారుతూ వస్తోంది.ఈ వ్యవహారాలు అన్నిటికీ కారణం అధికారులు అన్నది అందరికీ తెలిసిందే. వరుసగా ఇటువంటి తరహా సంఘటనలు జరుగుతున్నా, జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారాన్ని చూసుకుంటే, రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలాకోవడం సరికాదని , రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాలని, వాటికి తగిన విధంగా సహకరించాలని, కోర్టులు ఏపీ ప్రభుత్వానికి సూచించింది.

అలాగే ఎన్నికల కమిషన్ కు నిధులు సక్రమంగా విడుదల చేయకపోవడం వంటి విషయాలను కోర్టు తప్పుపట్టింది. దీనంతటికీ అధికారులే కారణం అనే చర్చ జరుగుతోంది. జగన్ ను కొంతమంది అధికారులు తప్పుదోవ పట్టిస్తున్న సరైన విధంగా సహకరించడం లేదనే విషయం జగన్ కు తెలిసినా, సర్దుకుపోతూ వెళ్లి పోతున్నట్లు గా వ్యవహరిస్తున్నారు. న్యాయవ్యవస్థను జగన్ పేచీ పెట్టుకున్నారు.ఏపీ ప్రభుత్వానికి న్యాయవ్యవస్థ వ్యతిరేకంగా ఉంది అనే విషయాన్ని కొంతమంది అధికారులు జగన్ నమ్మించడం వంటి వ్యవహారాలతో ఆయన కోర్టులతో ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసే వరకు జగన్ వ్యవహారం వెళ్ళింది. అయితే ఇందులో జగన్ పై చేయి అవుతుందా లేక ఆయన తీవ్రంగా నష్టపోతారా అనే విషయాన్ని పక్కనపెడితే, రాజ్యాంగ వ్యవస్థలతో ఢీ కొట్టడం అనేది అంత శ్రేయస్కరం కాదు అనే విషయాన్ని జగన్ గుర్తించలేకపోతున్నారు.

జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొంత మంది అధికారులను నియమించుకున్నారు. వారికి కీలక స్థానాలు అప్పగించారు. అయితే వారు మాత్రం తమ పని తీరు జగన్ కు నచ్చే విధంగా మార్చుకోక పోవడం వంటి కారణాలతో, మధ్యలోనే పక్కకు తప్పుకుంటున్నారు. మళ్లీ చంద్రబాబు హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం లోనూ చక్రం తిప్పుతున్నారు.ఇదంతా జగన్ కు చేటు తెచ్చే వ్యవహారమే. అందుకే అధికారుల విషయంలో జగన్ అప్రమత్తంగా లేకపోతే, మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనే సూచనలు ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news