నా సినిమా ఫ్లాప్ అయితే వారు సెలబ్రేట్ చేసుకుంటారు : అక్షయ్ కుమార్

-

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హిట్టు మీద హిట్టు కొడుతూ ఎవరు సాధించలేని రికార్డులు నమోదు చేసాడు. కానీ అదంతా గతం, అక్షయ్ హిట్టు కొట్టి కొన్ని సంవత్సరాలు అవుతోంది. ఏడాదికి నాలుగైదు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు అక్షయ్. కానీ హిట్టు మాత్రం పలకరించలేదు. మూడేళ్లలో 12 సినిమాలు రిలీజ్ చేసిన ఈ స్టార్ హీరోకు ఒక హిట్, ఒక యావరేజ్ మాత్రమే దక్కింది. మిగిలిన సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఏప్రిల్ లో విడుదలఅయిన బడే మియా చోటే మియా చిత్రం దాదాపు రూ.350కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయం పాలయింది.

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా చిత్రాన్ని ‘సర్ఫిరా’ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేసాడు అక్షయ్ కుమార్. ఒరిజినల్ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధా కొంగర ఈ రీమేక్ కు దర్శకత్వం వహించింది. ఇండియన్-2కు పోటీగా విడుదలైన ఈ చిత్రం టాక్ బాగున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం వీక్ గానే ఉన్నాయి. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా అక్షయ్ మాట్లాడుతూ “నా సినిమాలు ఫెయిల్యూర్ అయితే బాలీవుడ్ లోని కొంత మంది దాన్ని ఎంజాయ్ చేస్తూ, సెలబ్రేట్ చేసుకుంటారు. నన్ను అలా చూడటం వాళ్లకు ఇష్టం. అయితే ఈ విషయంలో నేను అమితాబ్ బచ్చన్ నుంచి ఒక విషయం నేర్చుకున్నాను. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయిన మన పనిని మనం చేసుకుంటూ పోవాలని, అదృష్టాన్ని నమ్ముకోవాలని అమితాబ్ నాతో చెప్పారు. అలా నేను శ్రమను నమ్ముకొని ముందుకు సాగుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు అక్షయ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version