సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ రాజకీయాలను వదలడం పై కీలక వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అన్న లేకపోతే ఎప్పుడో ఆత్మహత్య చేసుకునే వాడినని.. నా అన్న, నా దేవుడు, ఆయన కోసమే రాజకీయాలను వదిలేసి రంజిత్ అన్న వెనక నిలబడ్డారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి కాళ్లు మొక్కారు గణేష్. తాను ప్రస్తుతం ఏ పార్టీలో లేను అంటూనే రంజిత్ రెడ్డి వెనుక ఉన్నానని ప్రకటించారు.
నేడు ఎంపీ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గణేష్ ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు నేపథ్యంలో రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.