ఇలా చేయకపోతే పాన్ కార్డు చెల్లదు..!

-

మీకు పాన్ కార్డు వుందా..? అయితే ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. పాన్ కార్డు హోల్డర్లు పర్మినెంట్ అకౌంట్ నంబర్‌ను ఆధార్ తో లింక్ చేసుకోవాలి. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. 2023 మార్చి 31లోగా పాన్ కార్డు వున్నవాళ్లు తప్పక లింక్ చెయ్యాలి.

లేదంటే భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఆధార్‌ను పాన్ కార్డుతో అనుసంధానం చేయకపోతే కార్డు డీయాక్టివేట్ అవుతుందని గుర్తు చేసుకోవాలి. అప్పుడు పాన్ కార్డు ని వాడడం అవ్వదు. ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పింది కూడా. అయితే నిజానికి ఈ గడువు 2022 మార్చి 31 తో ముగిసింది. కానీ మళ్ళీ జూన్ 30 వరకు ఎక్స్టెండ్ చేసింది. ఇప్పుడు రూ. 1000 ఫైన్ చెల్లిస్తే లింక్ చెయ్యచ్చు.

ఇలా ఈజీగా ఆన్‌లైన్ పద్ధతిలో లింక్ చేసుకోవచ్చు:

దీని కోసం ముందు మీరు అధికారిక వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/ కు వెళ్లాలి.
ఇక్కడ మీరు క్విక్ లింక్స్ లో వున్న Link Aadhaar పై క్లిక్ చేయాలి.
మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు నంబర్‌ను ఎంటర్ చెయ్యండి.
తరవాత వాలిడేట్ బటన్ పై నొక్కండి.
ఆధార్, పాన్ లింక్ అయి ఉంటే అక్కడ కనపడుతుంది.
ఇప్పుడు మీకిక్కడ కొన్ని వివరాలు కోరుతూ పాప్ అప్ స్క్రీన్ వస్తుంది.
వివరాలని ఎంటర్ చేసి లింక్ ఆధార్ ఆప్షన్‌ పైన క్లిక్ చేయాలి.
లింక్ అయినా ఫోన్ కి OTP వస్తుంది.
ఓటీపీని ఎంటర్ చేసాక ఆధార్, పాన్ లింకింగ్ ప్రాసెస్ ముగుస్తుంది.
రూ.1000 ఫైన్ కట్టిన కొన్ని రోజుల తర్వాత ఈ ఆన్‌లైన్ ప్రాసెస్ చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version