ఆ నగరానికి వెళ్తే రూ. 25 లక్షలు ఇస్తారట..!

-

చాలామందికి..ఉన్న ఊరు నచ్చదు..చుట్టు ఉన్న మనుషులు కూడా నచ్చరు.. ఈ ప్రపంచానికి దూరంగా ఒక్కడినే ఎటైనా వెళ్లిపోతే బాగుండు అనిపిస్తుంది..కానీ అలా వెళ్లాలంటే మన దగ్గర పైసలు కావాలి. ఇంట్లో అడుగు బయటపెట్టింది మొదలు ఏం కావాలన్నా జేబులోంచి డబ్బులు తియ్యాలి.. అలా కాకుండా.. ఆ నగరానికి వెళ్లిపోతే.వాళ్లే ఎదురు మనకు రూ. 25 లక్షలు హ్యాపీగా ఇక్కడే ఉండేమంటే..అది ఏ కొండల్లోనో, గుట్టల్లోనో లేదు.. మంచి సిటీ.. చుట్టూ అందమైన భవనాలు.. మరి ఆ విచిత్రమైన పట్టణం గురించి చూద్దామా..!
మన దేశంలో జనాభా సంఖ్య పెరుగుతుంటే.. కొన్ని దేశాల్లో తగ్గుతోంది. పట్టణాలకు పట్టణాలు ఖాళీ అవుతున్నాయి. ఎంత బతిమలాడినా ప్రజలు తలో దిక్కుకూ వెళ్లిపోతున్నారు. చేసేది లేక అక్కడి ప్రభుత్వాలు డబ్బులిచ్చి మరీ జనాన్ని అక్కడ ఉండమంటున్నాయట.. ఇలాంటి వార్తలు మనం ఈ మధ్య వింటున్నాం.. తాజాగా అలాంటి ఓ పట్టణానికి వెళ్తే రూ.25 లక్షలు ఇస్తున్నారు.
అది ఇటలిలోని ప్రెసిసే (Presicce) పట్టణం. కొన్నేళ్లుగా ఈ టౌన్‌లో ప్రజలు పెద్దగా ఉండటం లేదు.. వెళ్లిపోతున్నారు… ఇప్పుడు ఇది దాదాపు ఖాళీ అయిపోయింది. అందువల్ల ఇటలీ ప్రభుత్వం.. ప్రపంచ టూరిస్టులకు ఆహ్వానం పలుకుతోంది. ప్రెసిసేకి వచ్చి.. స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధపడేవారికి రూ.25 లక్షలు ఇస్తామని ప్రకటించింది.
దక్షిణ ఇటలీలోని పుగ్లియాకి దగ్గర్లోనే ఉంటుంది ఈ ప్రెసిసే పట్టణం. ఇటలీలో చలి ఎక్కువ. ఇక్కడ మాత్రం ఎండ బాగానే పడుతుంది. జీవించేందుకు వీలైన, అందమైన పట్టణం ఇది. అక్కడికి వెళ్లిన వారు.. రూ.25 లక్షల్లోని కొంత డబ్బుతో ఓ ఇల్లు కొనుక్కోవచ్చు. ఇక్కడి చాలా ఇళ్లు తక్కువ ధరకే ఉన్నాయి. వాటిని ఓనర్లు ఎప్పుడో వదిలేసి వెళ్లిపోయారు.
ఇల్లు కొనుక్కొని స్థిర నివాసం ఏర్పరచుకున్నవారు.. అక్కడే ఏదైనా వ్యాపారం చెయ్యడం లేదా పని వెతుక్కోవడం వంటివి చేయాలి.. వ్యాపారం చేయాలనుకునేవారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ అందమైన పట్టణానికి దగ్గర్లోనే అందమైన బీచ్‌లున్నాయి. అందువల్ల ఇక్కడ జీవించాలనుకునే పర్యాటకులు.. తరచూ బీచ్‌కి వెళ్లి రిలాక్స్ అవ్వొచ్చు. కొన్ని సమస్యలున్నప్పటికీ.. అక్కడికి వెళ్లేందుకు సిద్ధపడే వారికి గ్రాండ్ వెల్‌కమ్ చెబుతున్నారు ప్రెసిసే అధికారులు. ఈ అందమైన పట్టణానికి దగ్గర్లోనే అందమైన బీచ్‌లు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version