కాలికి మెట్టెలు పెట్టుకుంటే ప్రగ్నెస్సీ త్వరగా వస్తుందా..? గర్భాశయ సమస్యలుండవా..?

-

పెళ్లి అయిందంటే.. ఆడవారి కాళ్లకు మెట్టెలు ఉంటాయి. అది వారికి కొత్త అందాన్ని తెచ్చిపెడుతుంది. సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది. బుజ్జిబుజ్జి కాలి వేళ్లకు చిన్న చిన్న రింగులు భలే ముచ్చటగా ఉంటాయి. ఇక మన అబ్బాయిలు అయితే కాలికి మెట్టలు ఉన్న లేడీస్‌ను చూస్తే పెళ్లైందని ఫిక్స్‌ అయిపోతారు. మెట్టెలు తొడగడం అనేది సంప్రదాయం అయినప్పటికీ దీని వెనక సైంటిఫిక్‌ రీజన్‌ ఉంది. అదేంటంటే..

మెట్టెలు తొడగడం వల్ల స్త్రీలలో గైనిక్ సమస్యలు చాలా వరకూ దూరమవుతాయి. కాలి వేళ్ళలో ఉండే నరాలపై మెట్టలు పెట్టుకుని నడవడం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ కారణంగా వారిలో కొన్ని నరాలు ఉత్తేజితమై గైనిక్ సమస్యల్ని దూరం చేస్తాయట. అంతే కాదు, వీటిని పెట్టుకోవడం వల్ల బాడీ సిస్టిమ్ కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందని నిపుణులు అంటున్నారు..

సంతాన సమస్యల్ని మెట్టెలు దూరం చేస్తాయా..?

వివాహమైన స్త్రీలు మెట్టెలు పెట్టుకోవడం వల్ల ఇరెగ్యులర్ పీరియడ్స్ వంటి సమస్యలు దూరమవుతాయట.. పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చి మహిళల్లో రీ ప్రొడక్టివ్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుంది. దీని కారణంగా త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అందుకే వివాహమైన స్త్రీలు కచ్చితంగా వీటిని ధరించాలని వారు సూచిస్తున్నారు. గర్భకోశంలోని నరాలకు, కాలి వేళ్ళకు సంబంధం ఉంటుంది. వేళ్ళకు అంటిపెట్టుకుని ఉండే మెట్టెలవల్ల గర్భ సంబంధమైన ఇబ్బందులు కలగవు.

స్త్రీలకే కాదు.. పురుషులకు కూడా మెట్టెలు పెడతారు.. అయితే అందరికీ కాదు. సంతానలేమి సమస్య ఉన్న పురుషులకు కాలి వేలికి రాగితీగను గట్టిగా చుడతారు. ఇలా ఒత్తిడి కలిగించడం వల్ల ఆ సమస్యలు నివారణ అవుతాయని నిపుణులు అంటున్నారు.

పురుషుల కంటే స్త్రీలలో కామవాంఛ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని అప్పట్లోనే మహర్షులు కనుగొన్నారు. స్త్రీలు మెట్టెలు ధరించినట్లయితే వారి కోరికలు నియంత్రణలో ఉంటాయని పురాతన గ్రంధాలు చెబుతున్నాయి.

ఇప్పుడు మెట్టెల్లో కూడా రకరకాల ఫ్యాషన్స్‌ వచ్చేశాయి. మార్కెట్ల్ వివిధ రకాల డిజైన్లలో మెట్టెలు ఉంటున్నాయి. వీటితో ఆడవారి అందం ఇంకాస్త రెట్టింపు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version