సమంత కోసం నాగచైతన్య చేస్తున్న పనులు చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత గతేడాది అక్టోబర్లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే .ఇక చాలా కాలం పాటు ప్రేమించుకున్న వీరు 4 సంవత్సరాల వైవాహిక జీవితానికి శుభం కార్డు వేస్తూ విడాకులు ప్రకటించారు. ఈ విషయం అటు సమంత అభిమానులను ఇటు నాగచైతన్య అభిమానులను తీవ్రంగా నిరాశకు గురిచేసింది. అంతేకాదు వీరిద్దరూ మళ్లీ ఒకటవ్వాలని చాలామంది కోరుకున్నారు కూడా.. కానీ అలా జరగలేదని.. ఇప్పటికే మనకు స్పష్టమవుతుంది. ఇకపోతే పెళ్లి తర్వాత వీరిద్దరూ కలసి నటించిన చిత్రం మజిలీ అని చెప్పవచ్చు . ఇక ఈ సినిమా తర్వాత ప్రేక్షకులు ఈ జంటకు బ్రహ్మరథం పట్టారు.

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంత చక్కటి జంట ఎందుకు విడిపోయింది అని బాధపడ్డారు కూడా.. ఇక విడాకుల తర్వాత నాగచైతన్య, సమంత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సమంత బాలీవుడ్ ప్రాజెక్టులో కూడా నటిస్తోంది. అదేవిధంగా తెలుగులో కూడా యశోద, ఖుషి వంటి సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఇక మరొకవైపు నాగచైతన్య కూడా తాజాగా అమీర్ ఖాన్ హీరోగా నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం నాగచైతన్య దూత అనే వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు.

ఇక అయితే నాగచైతన్యకు ఈ వెబ్ సిరీస్ లో నటించడం ముందుగా ఇష్టం లేదట. అంతేకాకుండా హారర్ థ్రిల్లర్ సినిమాల్లో నటించాలనే ఆలోచన కూడా నాగచైతన్యకి లేదట. కానీ పట్టుబట్టి సమంత.. నాగచైతన్య ఇందులో చేయాలని కోరిందట. ఇక అలా సమంత కోరిక మేరకు నాగ చైతన్య ఈ వెబ్ సిరీస్ చేయడానికి ఒప్పుకున్నారు. దాంతో ప్రస్తుతం సమంత లేకపోయినా ఆమెకు నచ్చిన పని చేస్తున్నాడు అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతూ ఉండడం గమనార్హం. కనీసం ఇలాగైనా ఇద్దరూ కలిస్తే బాగుండేదని ప్రతి ఒక్కరి అభిప్రాయం.

Read more RELATED
Recommended to you

Latest news