ప్రతి ఒక్కరు కూడా తీసుకొనే డైట్ పట్ల శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ముఖ్యంగా అల్పాహారం సమయంలో మంచి పోషక పదార్థాలు తీసుకుంటే రోజంతా ఆరోగ్యంగా, ఎనర్జిటిక్ గా ఉండడానికి అవుతుంది.
మనం తీసుకునే అల్పాహారం రోజంతా కూడా మనల్ని యాక్టివ్ గా ఉంచుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ అల్పాహారానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. అల్పాహారం సమయంలో మంచి పోషక పదార్థాలు ఉండే ఆహార పదార్థాలను డైట్లో తీసుకుంటే ఏ సమస్య లేకుండా ఉండొచ్చు. అయితే అల్పాహారం సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి అని ఇప్పుడు చూద్దాం.
ఖాళీకడుపుతో బాదం:
ఖాళీ కడుపుతో రెగ్యులర్ గా బాదం తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఉండవు. బాదం లో లో ప్రోటీన్, విటమిన్స్, మ్యాంగనీస్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజు అల్పాహారానికి ముందు ఖాళీ కడుపున బాదం తీసుకుంటే మనం మరింత ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది.
పాలు మరియు అరటిపండు:
పాలు, అరటి పండ్లు ప్రతి రోజు బ్రేక్ఫాస్ట్ సమయంలో తీసుకోవాలి. మీరు అరటిపండు పాలు విడిగా తీసుకోవచ్చు రెండు కలిపి కూడా తీసుకోవచ్చు. రెండు తీసుకున్న కూడా ఇబ్బంది ఉండదు.
ఓట్ మీల్:
పండ్లతో పాటు ఓట్ మీల్ కలిపి తీసుకుంటే మీరు మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇందులో ఫోలేట్, పొటాషియం వంటివి ఉంటాయి.
గుడ్లు:
ప్రతి రోజు గుడ్లు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది. అల్పాహారం సమయంలో ఒక గుడ్డు తీసుకుంటే మీరు మరింత దూరంగా ఉండొచ్చు. ప్రోటీన్ మొదలైన పోషక పదార్థాలు కూడా మీకు అందుతాయి.