వంటగదిలో సింక్ తళతళలాడాలంటే.. ఈ ఇంటి చిట్కాలు ట్రై చేసేయండి..!

-

వంటగదిలో పనిచేసినంత సేపు మనం ఎక్కువగా వాడేది సింక్‌నే. అందుకే ఇళ్లలోకి స్టెయిన్‌లెస్ స్టీల్ సింక్స్‌ని ఎక్కువగా ఎంపిక చేసుకుంటూ ఉంటారు. వంటగదిలో సింక్ దగ్గర కానీ..నీట్ గా లేదంటే..దాని ప్రభావం మొత్తం కిచెన్ పైన పడుతుంది. అసలు ఒక రకమైన దుర్వాసన కూడా వస్తుంది. సరే పై పైన క్లీన్ చేసుకుంటే..వాసన రానప్పటికీ..అది మురికపట్టి కనిపిస్తే..వంటగది లూక్కే మారిపోతుంది కదా.. మరి సింక్ ఎప్పుడూ కొత్తదానిలా తళతళలాడుతూ ఉండాలంటే ఏం చేయాలి? రోజు అదేపనిగా క్లీన్ చేయాలా..మా వల్ల కాదు అనుకుంటున్నారా..ఎవరి వల్లా కాదులేండి..ఈ చిన్న చిన్న టెక్నిక్స్ వారానికి ఒకసారి ఫాలో అయితే..సింక్ కొత్తదానిలా ఎప్పటికప్పుడు మెరిసిపోతుంది.

శుభ్రం చేద్దామిలా..!

రసాయనాలతో కూడిన లిక్విడ్‌వాష్‌లు, డిటర్జెంట్‌లు ఉపయోగించి సింక్‌ని శుభ్రం చేయడం వల్ల దాని నాణ్యత పోతుంది..అందుకే సహజసిద్ధంగా తయారుచేసిన పదార్థాలతో శుభ్రం చేయడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంట్లోనే ఉండే బేకింగ్ సోడా, వెనిగర్, నిమ్మ లేదా నారింజ తొక్కలు, ఆలివ్ నూనె.. మొదలైనవి ఉపయోగించి సింక్‌ని సులభంగా క్లీన్ చేసుకోవచ్చు..

ముందుగా సింక్‌లో ఎలాంటి చెత్తా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఒక మెత్తటి స్పాంజ్ సాయంతో సింక్ అంతా వ్యాపించేలా బాగా రుద్ది, తర్వాత వెనిగర్‌తో కడగాలి. తర్వాత నీటితో శుభ్రం చేసి నిమ్మ లేదా నారింజ తొక్కలతో మెల్లగా సింక్ మొత్తం రుద్దాలి. ఇలా చేయడం వల్ల సింక్ నుంచి దుర్వాసన రాకుండా, తాజాగా ఉండడంతో పాటు ఎప్పటికీ కొత్తదానిలా మెరిసిపోతుంది..మళ్లీ నీళ్లతో శుభ్రం చేసి, తడి పూర్తిగా ఆరిన తర్వాత మెత్తని వస్త్రంపై ఆలివ్‌నూనె వేసి సింక్ మొత్తం తుడవండి. ఇలా వారానికో 15రోజలకో చేస్తూ ఉంటే..సింక్ క్లీన్ గా..అందంగా కనిపిస్తుంది.

ఇవి చేయొద్దు..

లిక్విడ్ సోప్ లేదా ఇతర హౌస్‌హోల్డ్ క్లీనర్స్‌ను స్టెయిన్‌లెస్ స్టీల్ సింకును శుభ్రం చేయడానికి ఉపయోగించకండి.

సింక్‌లో బ్లీచ్, క్లోరిన్ వంటి పదార్థాలు కూడా ఎక్కువ సమయం ఉంచకండి. అలా ఉంచడం వల్ల మెరుపు తగ్గే అవకాశం ఉంది.

గిన్నెలు వేసేటప్పుడు, వాష్ చేసేటప్పుడు.. నెమ్మదిగా పని చేసుకోవాలి. లేదంటే వాటి వల్ల గీతలు పడతాయి.

ఉపయోగించిన ప్రతిసారీ నీళ్లు నిల్వ ఉండిపోకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు వేడినీళ్లలో మైల్డ్ సోప్ కలిపి వాటితో సింక్‌ని శుభ్రం చేయాలి.

సింక్ పై తుప్పు, నీటి మచ్చలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. మెత్తని క్లాత్ వైట్ వెనిగర్ వేసి తుడవడం వల్ల ఈ సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది.

స్టీల్ లేదా ఐరన్ స్క్రబ్స్ ఉపయోగించడం వల్ల గీతలు పడతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని సింక్‌లో వాడద్దు.

ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే..మీ స్టీల్ సింక్ అందంగా ఉంటుంది. దాంతో కిచెన్ కి కూడా మంచి లుక్ వస్తుంది. మీరు గమనించే ఉంటారు..చాలా మంది ఇళ్లలో వంటగది బాగున్నా..వారు వాడే సింక్ అస్సలు బాగుండదు. దాంతో అక్కడ ఎక్కువ సేపు నిలబడాలనిపించదు కూడా..మన ఇంట్లో సింక్ అలానే ఉంటే ఎట్లా మరీ..!

Read more RELATED
Recommended to you

Latest news