ముక్కు మీద చిన్న పింపుల్ వచ్చినా చాలా చెండాలంగా ఉంటుంది. మన చెయ్యి ఎప్పుడూ దాని మీదకే వెళ్తుంది. ఇంక ముక్కు మీద బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటే.. అసలు బాగుండదు కదా..! ముఖం అందం అంతా పోతుంది. ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, చర్మంపై మురికి, మృతకణాలు పేరుకుపోవడం, హార్మోన్ల అసమతుల్యత కారణంగా బ్లాక్ హెడ్స్ వస్తూ ఉంటాయి. జిడ్డు చర్మం ఉన్న వారిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది.
చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి ఖరీదైన క్రీములను వాడుతూ ఉంటారు. పార్లర్స్‌కి వెళ్లి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. ఎటువంటి ఖర్చు లేకుండా చాలా సులభంగా ఇంట్లో ఉండే పదార్థాలతోనే చిన్న చిట్కాను తయారు చేసి వాడడం వల్ల బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. దీనిని తయారు చేయడం చాలా సులభం. అలాగే వాడడం కూడా చాలా సులభం.
ముక్కు మీద బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోవాలంటే ఇలా చేయండి..!
జార్‌లో పుదీనా ఆకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పావు చెక్క నిమ్మరసం, టూత్ పేస్ట్, పసుపు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు బ్లాక్ హెడ్స్ ఉన్న చోట వేడి నీటితో శుభ్రంగా కడగాలి. తరువాత 5 నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. తరువాత దీనిపై పుదీనా పేస్ట్‌ను రాసి సున్నితంగా మర్దనా చేసుకోవాలి. దీనిని అరగంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. కొద్దిగా బరకగా ఉండే వస్త్రాన్ని తీసుకుని బ్లాక్ హెడ్స్‌పై రుద్దాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. ఇలా వరుసగా మూడు రోజుల పాటు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా ఇంట్లోనే చాలా సులభంగా ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్‌ను, వైట్ హెడ్స్‌ను తొలగించుకోవచ్చు