బరువు పెరగడానికి ప్రధాన కారణం..సమయపాలన లేకుండా తినడమే.. మీరు ఏం తిన్నారు అనేదాని కంటే..ఏ టైంలో తిన్నారనేది మీ ఆరోగ్యంపైన ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..అడ్డదిడ్డంగా బరువు పెరగక తప్పదు. అలాగే బరువు తగ్గాలన్నా కూడా..కడుపు మాడ్చుకుంటూ ఉండక్కర్లా.. కరెక్టుటైమ్‌లో పొట్టలో ఆహారం వేస్తే చాలు.. ముఖ్యంగా మధ్యాహ్నం తినే తిండి మీద టై మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. పొట్టలో అస్సలు కాళీ ఉంచకూడదు..అలా ఉంటే గ్యాస్ ఫామ్ అవుతుంది.. అలా అని ఏది పడితే అది అసలే తినొద్దు..!
మధ్యాహ్నం 3 గంటల్లోపు లంచ్ పూర్తి చెయ్యాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే బరువు తగ్గేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.
అనేక మందిపై చేసిన పరిశోధనలో ఇదే విషయం తేలింది. 14 వారాలు పాటు ఖచ్చితమైన సమయాల్లో వారికి భోజనం పెట్టారు. సమయానికి భోజనం చేసిన వ్యక్తులు 2.5 కేజీలు తగ్గినట్టు పరిశోధనలో తేలింది. ఇదే కాదు రక్తపోటు, మానసిక పరిస్థితిలో కూడా మార్పులు గమనించారు.
బర్మింగ్‌హామ్‌లోని అలబామా యూనివర్శిటీ ఈ అధ్యయనం చేసింది. ఈ పరిశోధనలో పాల్గొన్న వారిలో కొంతమంది వారానికి రెండు సార్లు ఉపవాసం కూడా చేయించారు. తినే టైమ్‌ను ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మార్చారు. ఇలా చేయడం వల్ల శరీరం, మెటబాలిజంలో కూడా మార్పులు జరిగి కొవ్వు కరిగిపోవడం జరిగినట్టు గుర్తించారు.
అధ్యయనం ఎలా జరిగింది..
ఈ అధ్యయనంలో 90 మంది ఊబకాయం ఉన్న వారిని తీసుకున్నారు. వాళ్ళని రెండు భాగాలుగా విడగొట్టి సగం మందికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమయానికి ఇస్తూ సుమారు 150 నిమిషాల పాటు వ్యాయామం కూడా చేయించారు. మధ్యాహ్నం 3 గంటల్లోపు తినే వారిలో ఇన్సులిన్ స్థాయిలు ఎక్కువ సేపు ఉంటున్నాయి. కేలరీలు కూడా కరిగిపోయాయి. వారిలో సగం మందికి ఉపవాసం చేయమని కూడా చెప్పారు. 14 వారాల పాటు 6 సార్లు ఉపవాసం చేయించారు. వారిలో కూడా సత్ఫలితాలు కనిపించాయి.
ఎప్పుడైనా సరే.. మనం తినే ఆహారాన్ని టైమ్‌కు తినాలి..మీకు ఆ టైమ్‌కు పెద్దగా ఆకలి వేయకున్నా సరే.. తింటే ఓ పని అయిపోతుందా అనుకుని తినేయడమే.. అయితే మరీ అస్సలు తినాలని లేదు.. పొట్టంతా హెవీగా ఉందంటే.. పర్లేదు తినకండి. పొట్టకు ఆ పూట రెస్ట్ ఇవ్వండి..ఉదయం 8 గంటల లోపు టిఫెన్, మధ్యాహ్నం 3 గంటల లోపు లంచ్, రాత్రి 8 గంటల లోపు డిన్నర్ మధ్యలో సాయంత్రం ఏవైనా లైట్ స్నాక్స్ ఇలా మీ డైట్ టైమ్‌ను సెట్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.