నిర్మల్ జిల్లా బాసర త్రిపుల్ ఐటీ లో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి భోజనం చేసిన వందలాది విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. కడుపు నొప్పి అలాగే వాంతులతో ఏకంగా 600 మంది అస్వస్థలయ్యారు. యూనివర్సిటీ మెయిన్ లో శుక్రవారం రాత్రి 3000 మంది విద్యార్థులు భోజనం చేశారు. ఆ తర్వాత హాస్టల్ కి వెళ్ళిన వీరిలో ఒక్కొక్కరుగా ఇబ్బందిని ఎదుర్కొన్నారు. దీంతో అధ్యాపకులు తమ కార్లలో యూనివర్సిటీలోని ఆసుపత్రికి తరలించారు.
9 మంది విద్యార్థులకు నిజామాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రి ఐసీసీలో చికిత్స అందిస్తున్నారు. వీళ్ళ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అస్వస్తులైన మరో వంద మందిలో కొందరిని నిజామాబాద్, నవీపేట లోని ప్రవేట్ ఆసుపత్రులలో… ఇంకొందరినీ త్రిపుల్ ఐటీ లోని ఆసుపత్రిలో చేరిచారు. దాదాపు 400 నుంచి 500 మంది స్వల్ప అనారోగ్యానికి గురికాగా.. చికిత్స అనంతరం హాస్టళ్లకు పంపించేశారు. ఆహారం అలాగే తాగునీరు కలుషితం కావడం కారణంగా ఈ ఘటన జరిగిందని ప్రాథమిక విచారణకు వచ్చారు అధికారులు. నిజామాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో విద్యార్థులు పరామర్శించిన డిఎంహెచ్ఓ డాక్టర్ సుదర్శన్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.