షాకింగ్: టీఎంసీ ఎంపీ భార్యను ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు..

తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కోల్కతా ఎయిర్ పోర్ట్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బెనర్జీ భార్యకు ఇమ్మిగ్రేషన్ అధికారులు షాక్ ఇచ్చారు. ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా నరుల బెనర్జీ కోల్కతా నుండి దుబాయ్ వెళ్ళడానికి ఎయిర్ పోర్ట్ కు రావడం జరిగింది. అయితే లోపల ఈమె దుబాయ్ వెళ్ళడానికి క్లియరెన్స్ ఇచ్చే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత ఈడీ అధికారులు రుజీరకు నోటీసులు అందించడం జరిగింది. జూన్ 8వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈమె బొగ్గు కుంభకోణం కేసులో సంబంధాలు ఉన్నాయన్న కారణంతో ఆమెను ఈడీ అధికారులు ఇంతకు ముందు విచారించి ఉన్నారు.

ఇప్పుడు మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. అందుకే రూజీరాను దుబాయ్ వెళ్లకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది.