దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమలు….రూ.50వేల కంటే ఎక్కువ తీసుకెళ్తే…?

-

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈక్రమంలో ప్రజలు రూ.50వేల కంటే ఎక్కువ నగదును తీసుకొని వెళ్లరాదు అని సూచించింది. ఒకవేళ తీసుకొని వెళితే కచ్చితంగా రసీదు, ఇతర డాక్యుమెంట్స్ చూపించాల్సిందే అని వెల్లడించింది. తనిఖీల్లో దొరికితే పోలీసులు డబ్బును స్వాధీనం చేసుకుంటారని పేర్కొంది. బంగారం, వెండి వంటి ఆభరణాలు సైతం పెద్ద మొత్తంలో తీసుకెళ్లకూడదు. ఆస్పత్రి, ఇతర అత్యవసరాల కోసం డబ్బు తీసుకెళ్తే రోగి రిపోర్టులు, రసీదులను చూపించాలి అని తెలిపింది.

కాగా, దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల కమిషన్.ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.కేంద్ర ఎన్నిల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్‌ మరో ఇద్దరు కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్ సంధు,జ్ఞానేశ్‌కుమార్‌ లతో కలిసి ఈ ఎన్నికల షెడ్యూల్‌ని విడుదల చేశారు.ఏప్రిల్ 19వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభమవుతుండగ,జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version