ఇలా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి..!

-

ఈ మధ్యకాలంలో పిల్లల నుండి పెద్దల వరకు కంటి సమస్యలు వస్తున్నాయి. టీవీ, స్మార్ట్ ఫోన్ మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల ఈ సమస్య మరింత ఎక్కువ అయిపోయింది. అయితే కంటి ఆరోగ్యం బాగుండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు. అయితే మరి కంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.

 

హైడ్రేట్ గా ఉండండి:

నీళ్ళు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. శరీరానికి సరిపడా నీళ్ళు తాగాలి. అలా అవసరమైనంత నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాదు. డీహైడ్రేషన్ కనుక వచ్చిందంటే కంటిపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగండి.

ఎక్కువ ఆకుకూరలు తీసుకోవడం:

అవసరమైన పోషక పదార్థాలు కూరగాయలు మరియు ఆకుకూరలలో ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఆకుకూరల్ని డైట్ లో ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.

బరువు:

ఒబిసిటీ ఉంటే కంటి ఆరోగ్యం పై నెగెటివ్ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీ యొక్క బరువును కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సరిపడ బరువు ఉండేట్టు చూసుకోండి.

విటమిన్స్ ఎక్కువగా తీసుకోండి:

మన శరీరానికి విటమిన్స్ చాలా ముఖ్యం. కనుక విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ ఇలా అన్ని విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే కంటి సమస్యలు తగ్గుతాయి.

స్మోకింగ్ మానేయండి:

స్మోకింగ్ వల్ల కూడా కంటి సమస్యలు వస్తాయి. కాబట్టి పొగ తాగకుండా ఉండండి. దీనితో కూడా కంటి సమస్యలు వుండవు.

Read more RELATED
Recommended to you

Latest news