పీకల్లోతు అప్పుల్లో ఉన్న పాకిస్థాన్ లో ఇప్పుడు రాజకీయ సంక్షోభంతో ఇబ్బందులు ఎదర్కొంటోంది. పాక్ ప్రధానిపై పలువురు ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా… ఇమ్రాన్ సర్కార్ కూలిపోవడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ కు 75 మంది ఎంపీలు, 3 మంత్రులు తమ మద్దతు ఉపసంహరించుకున్నారు. తాజాగా మరోసారి ఇమ్రాన్ గట్టి ఎదురుదెబ్బ తాకింది.
ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతు ఇస్తున్న ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్తాన్ (MQM-P), పాకిస్తాన్ ముస్లిం లీగ్-క్వైడ్ (PML-Q) మరియు బలూచిస్తాన్ అవామీ పార్టీ (BAP) పార్టీలు ప్రతిపక్షానికి మద్దతు ఇవ్వనున్నట్లు పాక్ మీడియా పేర్కొంది. దీంతో ఇమ్రాన్ ఖాన్ సర్కారు కూలిపోవడం దాదాపుగా ఖాయం అయింది. 342 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో మెజారిటీకి అవసరమైన 172 కంటే తక్కువ మద్దతు ఉంది. ఇస్లామిక్ కూటమి సమావేశం అనంతరం ప్రధానిగా దిగిపోవాలని ఆర్మీ ఇమ్రాన్ ఖాన్ కు అల్టిమేటం జారీ చేసింది. ఈ పరిణామాల మధ్యనే ఇటీవల ఇమ్రాన్ ఖాన్ భారత దేశంపై, ఇండియన్ ఆర్మీపై ప్రశంసలు కురిపించారు.