యువకుడి ఆలోచన అదరహో..రంగుల పూరీలతో లక్షల ఆదాయం..

-

కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు..మహా పురుషులు అవుతారు..అనేది ఎంత నిజమో అందరికి తెలుసు..చేయాలనే తపన,డబ్బులు సంపాదించాలనే కోరిక ఓ యువకుడిని తీవ్రంగా ఆలోచింపచేసింది.. దాంతో అతను ఒక ఫుడ్ బిజినెస్ ను స్టార్ట్ చేయాలనీ అనుకున్నాడు.అందరూ చేస్తున్న విధంగా కాకుండా కాస్త కొత్తగా చేయాలనీ అనుకున్నాడు. భోజన ప్రియులను ఆకర్షించడానికి అందరు చేస్తున్నట్లు వెరైటీ ఫుడ్ ను అందిచాలని అనుకున్నాడు. అలానే తన ఆలోచనకు పదును పెట్టాడు. చివరికి సక్సెస్ అవ్వడంతో పాటు అందరికి ఆదర్శంగా నిలిచాడు..

తన భార్య సహకారం కూడా తోడు అయ్యింది.ఇద్దరు కలిసి చిన్నగా వ్యాపారం మొదలు పెట్టారు.పీజీ చదివిన గుప్తా.. ఎంబీఏ చదివిన భార్య శిరీషతో కలిసి ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అందరి హోటళ్లలో దొరికే పూరీలు, దోసెలు, ఇడ్లీలు కాకుండా కొత్తగా చేయాలనే ఆలోచనతో పోషకాలు కలిగిన పాలకూరతో పాలక్ పూరీలు, క్యారెట్ పూరీలు, రాగి ఇడ్లీలు ఇలా ఆరోగ్యానికి హాని లేకుండా మంచి పోషక పదార్థాలు ఉన్న వాటిని టిఫిన్ రూపంలో అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి కూడా ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనతో.. నాలుగు దశాబ్దాలుగా తమ కుటుంబాన్ని పోషిస్తున్న హోటల్ నడుపుతున్నట్లు అతను చెప్పారు.

మొదట్లో అందరు తనను ఎగతాళి చేశారని, అంత చదువు చదివి ఇలా చేయడం ఏంటి అని తిట్టిపోసారు.తన తండ్రి చేసిన దానిని తాను మరింత డెవలప్ చేస్తాననే నమ్మకంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపాడు. తన తండ్రి నుండి వచ్చిన అనుభవంతో కస్టమర్లకు పరిశుభ్రమైన వాతావరణంలో మంచి రుచికరమైన రంగురంగుల టిఫిన్ లను అందిస్తూ ఎందరో అభిమానుల ఆదరాభిమానాలను సంపాదించుకున్నాము..చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.ఖమ్మం నగర వాసులు ఆరోగ్య కరమైన, తక్కువ ధరలో అందరికి అందుబాటులో ఉన్న రంగురంగుల పూరీలు, దోసెలు, ఇడ్లీలు తినాలంటే బస్ డిపో రోడ్ లోని గుప్తా హోటల్‌కి ఒక్కసారి వెళ్లాల్సిందే..

Read more RELATED
Recommended to you

Latest news