తిరుమలలో అగ్ని ప్రమాదం

-

తిరుమలలో అగ్ని ప్రమాదంలో ప్రమాదం జరిగింది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆస్థాన మండపంలో ఘటన చోటు చేసుకుంది. ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రాంతంలో ఉన్న మ్యాట్లకు నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

 

తిరుమలలో అగ్ని ప్రమాదం.. | Fire Accident, Tirumala, Srivari, Asthan Mandapam, Shops - Telugu Asthan Mandapam, Shops, Srivari, Tirumala

ఆస్థాన మండపంలో అగ్నిప్రమాదం జరగడంపై తిరుమల అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. నిరుపయోగంగా ఉన్న పరుపులు దగ్ధం కావడంతో ప్రమాదం జరిగిందని తితిదే అధికారులు తెలిపారు. ఆకతాయిలు నిప్పంటించడంతో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. తిరుమల మొదటి ఘాట్ రోడ్‌లో ఏనుగులు హల్ చల్ చేశాయి. ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు తిష్ట వేసింది.గుంపులో ఐదు మదపటేనుగులు, ఒక గున్న ఏనుగు ఉన్నాయి. దీంతో ఘాట్ రోడ్‌లో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. అవి ఎక్కడ తమపై దాడి చేస్తాయోనని కంగారు పడుతున్నారు. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు ఏనుగులను తిరిగి అడవిలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరుమల ఘాట్ రోడ్ 7వ మైలు వద్ద అంటే ఆంజనేయ స్వామి విగ్రహానికి అత్యంత సమీపంలో ఏనుగుల సంచారాన్ని భక్తులు గుర్తించారు. రోడ్డుకు పక్కనే ఈ ఏనుగులు సంచరిస్తుండటంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు.కాగా ఈ ప్రాంతంలో ఇటీవలి కాలంలో తరుచుగా ఏనుగులు రావడం జరిగింది. ఐదారుసార్లు ఏనుగులు వచ్చాయి. రోడ్డు మీదకు కూడా ఏనుగులు వచ్చిన పరిస్థితి ఉంది. అక్కడున్న వెదురు పొదలను ధ్వంసం చేయడం, తినడం ఆ తర్వాత వెళ్లిపోవడం గతంలోనూ జరిగింది. అదే విధంగా తాజాగా కూడా ఏనుగులు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న భక్తులు, స్థానికులు ఏనుగులను చూశారు. వెంటనే వాటిని తమ ఫోన్లలో వీడియో తీశారు. ఏనుగులు ఎక్కడ తమపై దాడికి దిగుతాయోనని భక్తులు, స్థానికులు కాస్త భయాందోళనకు గురయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news