కేంద్ర ప్రభుత్వం డివిజల్ ఆర్థిక వ్యవస్థ ప్రోత్సాహించడంపై దృష్టి సారించింది. ఈ మేరకు ఆయా రంగాల అభివృద్ధిపై నిరంతరం చర్యలు తీసుకుంటోంది. డిజిటల్ వ్యవస్థను పెంపొందించుకోవడానికి నగదు లావాదేవీలకు సంబంధించిన నిబంధనలకు కఠినతరం చేసింది. నగదు లావాదేవీలు జరిపితే దానికి ఆదాయపు పన్ను విధించడం జరుగుతుందని కేంద్రం స్పష్టం చేస్తోంది. అయితే ఇంట్లో దాచుకున్న నగదుపై పరిమితి నిర్ణయించబడలేదని కేంద్రం పేర్కొంది. అయితే నగదు లావాదేవీలకు సంబంధించిన అన్ని నిబంధనల గురించి తెలుసుకుందాం.
2020 మార్చి నెలలో సుమారు రూ.24-25 లక్షల కోట్ల నగదు చెలామణి జరిగిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2021 జనవరి వరకు ఇది రూ.27 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. అందుకే నగదు లావాదేవీలకు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించడం, నిబంధనలను కఠినతరం చేయడం జరుగుతోంది. ఈ మేరకు కొన్ని నిబంధనలు కేంద్రం వెల్లడించింది. రూ.2000పైగా విరాళాన్ని నగదు రూపంలో ఇవ్వకూడదు. రూ.5వేల కంటే ఎక్కువ నగదులో వైద్య ఖర్చులపై పన్ను మినహాయింపు లేదు. రూ.10 వేల కంటే ఎక్కువ రూపాయల కోసం నగదు ఖర్చు చేస్తే.. ఆ మొత్తాన్ని మీ లాభ మొత్తానికి జోడించడం జరుగుతుంది.
రూ.20 వేలకు మించి నగదు రుణాన్ని తీసుకోలేరు. ఒక వేళ తీసుకుని నిబంధనను ఉల్లంఘించినట్లయితే జరిమానా చెల్లించాలి. విదేశీ మారకద్రవ్యాల దిగుమతిలో రూ.50 వేలకు మించిన మొత్తాన్ని నగదు రూపంలో తీసుకోలేరు. రూ.2 లక్షలకు మించిన నగదు కొనుగోలు చేయలేము. బ్యాంకుల ద్వారా రూ.2 కోట్ల నగదును విత్‌డ్రా చేసుకున్నట్లయితే టీడీఎస్ విధిస్తారు. అయితే ఇంట్లో ఎంత నగదు ఉండవచ్చు అనే దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదని పన్ను నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ నిబంధనలు అతిక్రమించిన వారిపై 137 శాతం జరిమానా విధించడం జరుగుతుంది.
బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ నగదు డిపాజిట్ చేసుకునే దానిపై కొన్ని నిబంధనలు రూపొందించబడ్డాయి. రూ. 50 వేలు నుంచి రూ.2 లక్షలను ఒకేసారి డిపాజిట్ చేస్తే బ్యాంకులో పాన్ కార్డు నంబర్ ఇవ్వాలి. పే ఆర్డర్, డిమాండ్ డ్రాఫ్ట్ నగదు రూపంలో చెల్లించినట్లయితే పాన్ కార్డు నంబర్ అటాచ్ చేయాలి. ఒకవేళ అలా చేయకుండా నగదు డిపాజిట్ చేసినట్లయితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.