ఉప ఎన్నిక వేళ భగత్ వీడియో వ్యూహత్మకంగా తెర పైకి తీసుకొచ్చారా ?

Join Our Community
follow manalokam on social media

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల్లో ఒక వీడియో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ వీడియోను డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ ట్వీట్‌ చేయడంతో హైప్‌ ఇంకా పెరిగింది. సోషల్‌ మీడియాలోనూ హల్‌చల్‌ చేస్తోంది. పెట్‌ డాగ్‌ను ఆరు బయటకు తీసుకెళ్తున్నట్టుగా.. చిరుతపులితో కలిసి వాకింగ్‌ చేస్తోన్న నోముల భగత్ వీడియో పై ఇప్పుడు సాగర్ ఉప ఎన్నిక వేళ చర్చ నడుస్తుంది. ఈ వీడియో ఇప్పుడే తెర పైకి రావడానికి కారణం ఏంటి..వ్యూహత్మకంగానే ఈ వీడియో ట్రెండింగ్ లో తెచ్చారా అన్న అంశం పై ఇప్పుడు చర్చ మొదలైంది.

నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న నోముల భగత్‌. ఆఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు చిరుతతో సరదాగా సఫారీ చేశారు. అప్పుడు తీసుకున్న వీడియో ఇప్పుడు ఉపఎన్నిక సమయంలో బయట కొచ్చింది..సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అయింది. ఉపఎన్నిక లేకపోతే ఈ వీడియోను ఎవరూ పెద్దగా పెట్టించుకునే వారు కాదేమో. డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ ఈ వీడియోను ట్వీట్‌ చేయడంతో పాపులారిటీ వచ్చేసింది. వీడియోతోపాటు భగత్‌ను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్‌ ఇంకా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు సోషల్‌ మీడియాలో ఈ వీడియో సర్క్యూలేట్‌ కావడం ఒక ఎత్తు అయితే.. దానికి ఆర్జీవీ కామెంట్స్‌ ఇంకొ ఎత్తు.

చిరుతతో ప్రచారం చేస్తోన్న వ్యక్తిని చరిత్రలో చూడలేదని చెప్పారు ఆర్జీవీ. కేసీఆర్‌, కేటీఆర్‌లు టైగర్‌.. లయన్‌లుగా తనకు తెలుసని.. కానీ ఒక చిరుతను చైన్‌తో కట్టేసి వాకింగ్‌ చేస్తోన్న భగత్‌ను ఇప్పుడే చూస్తున్నానని ఆర్జీవీ ట్వీట్‌ చేశారు. ఒకవేళ నాగార్జునసాగర్‌లో తనకు ఓటు ఉంటే ఈ రియల్‌ హీరోకే ఓటు వేసేవాడినని ముగించారు రాంగోపాల్‌ వర్మ. ఇంకొందరు వీడియోను ఆసక్తిగా చూస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో ఎలా బయటకొచ్చిందో కానీ.. బరిలో ఉన్న అభ్యర్థికి మాత్రం సోషల్‌ మీడియాలో ప్రచారం ఓ రేంజ్‌లో జరుగుతోంది.

అయితే ఈవీడియే ఇప్పుడు తెరపైకి రావడానికి కారణం ఒక లాజీక్ ఉన్నట్లు తెలుస్తుంది. టీఆర్ఎస్ పట్ల సాధరణంగా యువతలో అంత సానుకూలత లేదు. భగత్ ని యూత్ ఐకాన్ గా హీరోయిటిక్ గా ఫోకస్ చేసి ఉప ఎన్నికల్లో యువత దృష్టిని ఆకర్షించాలని చూస్తుంది టీఆర్ఎస్. జానారెడ్డి పాతతరం నేతగా భగత్ యూత్ ఐకాన్ గా ప్రచారంలోకి తీసుకొస్తుంది. ఇక ఆర్జీవీ ట్విట్ కూడా టీఆర్ఎస్ కి ప్లస్ అయింది. ఈ విడియోతో భగత్ సాగర్ ఉపఎన్నికలో యువత దృష్టిని ఆకర్షిస్తాడో లేదో చూడాలి.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...