ఇలా సులభంగా ఇమ్యూనిటీని పెంచుకోండి…!

-

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం బాగుండాలి. అలానే జీవన విధానం కూడా బాగుండాలి. అయితే అనారోగ్య సమస్యల బారిన త్వరగా పడకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తి ఉండాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల చలికాలంలో త్వరగా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి..? సులభంగా ఏ ఆహార పదార్థాల తో ఇమ్యూనిటీ పొందొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. రోగ నిరోధక శక్తి పెంచుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సరైన పోషక పదార్థాలని ఆహారంలో తీసుకోవాలి ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది.

ఉసిరి:

ఉసిరి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అలానే యాంటీఆక్సిడెంట్లు కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఖాళీ కడుపుతో ఉసిరిను తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. జుట్టు ఆరోగ్యానికి చర్మానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది.

తేనే:

రోగనిరోధకశక్తిని పెంచడానికి తేనే కూడా సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో ఒక స్పూను తేనె తీసుకుంటే బరువు తగ్గొచ్చు. అలానే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. తేనె నిమ్మరసం కలిపి తీసుకుంటే కూడా మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

వెల్లుల్లి:

వెల్లుల్లి కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇతర సమస్యలు కూడా తరిమికొడుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news