భారత్-పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచి యుద్ధం వాతావరణం నెలకొన్నది. తొలుత పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాదులు పహల్గామ్ పై దాడి చేయడంతో భారత్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యుద్ధం జరుగుతుందనే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాలు శాంతియుతంగా వ్యవహరించాలని చెప్పడంతో కాస్త శాంతిగా ఉన్నారు. ఆ తరువాత వెంటనే పాకిస్తాన్ భారత్ పై దాడులు చేశారు.
పీఎస్ఎల్ కోసం పాకిస్తాన్ కి వెళ్లిన విదేశీ ఆటగాళ్లు ఇండియా, పాకిస్తాన్ యుద్ధం వల్ల తీవ్ర భయాందోళనకు గురయ్యారని బంగ్లాదేశ్ రిషద్ హుస్సెన్ తెలిపారు. పీఎస్ఎల్ రద్దయ్యాక ఫ్లైట్ లో దుబాయ్ కి వెళ్లాం. అక్కడ దిగగానే మేము బయలుదేరిన తరువాత పాకిస్తాన్ విమానాశ్రాయాన్ని క్షిపణీ ఢీ కొన్నదనే వార్త విన్నాం. బిల్లింగ్స్, మిచెల్, పెరీరా, టామ్ కరన్ చాలా భయపడిపోయారు. టామ్ కరన్ మాత్రం చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేశారు. పాకిస్తాన్ కి మళ్లీ రానని మిచెల్ పేర్కొన్నారు.