ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో 5వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఈ ఐదో టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకు వెళ్తోంది. ఆరంభములో వికట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాలో రిషబ్ పంత్ అదిరిపోయే ఆటతీరు తో ఆదుకున్నాడు.
ఏకంగా 146 పరుగులు చేసి కదం తొక్కాడు పంత్. గత కొన్ని రోజులుగా తన బ్యాటింగ్ పై విమర్శకులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో… తన బ్యాట్ జులిపించి వారికి సమాధానం చెప్పాడు పంత్. అద్భుతమైన సెంచరీ తో కదం తొక్కి అభిమానుల్లో ఆశలు చిగురించాడు. ధనాధన్ ఇన్నింగ్స్ తో టీమ్ ఇండియాను ఆదుకున్న రిషబ్ పంత్.. అత్యంత వేగంగా టెస్ట్ శతకం సాధించిన భారత వికెట్ కీపర్ గా రికార్డులోకి ఎక్కాడు. కాగా.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇండియా తమ తొలి ఇన్నింగ్స్ లో 73 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది.