ఇండియాలో కరోనా మహమ్మారి పూర్తిగా శాంతించినట్లు కనిపిస్తోంది. గత 15 రోజుల నుంచి లెక్కలు చూస్తే…కరోనా తీవ్రత ఎలా ఉందో తెలుస్తుంది. అయితే..నిన్న ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ మాత్రం బాగా తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 10273 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,16,117 కు చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,11,472 కు చేరింది.ఇక దేశం లో కరోనా పా జిటివిటి రేటు 97.82 శాతం గా ఉంది. ఇక దేశంలో తాజాగా 255 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,13,724 కి చేరింది.
ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,77,44,08,129 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 24,05,049 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 20439 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,22,90,921 కు చేరింది.