మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా పెరిగిన అప్పులు !

మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇండియా అప్పుల భారం భారీగా పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. 2014-15 నాటికి దేశ నికర అప్పు రూ.62,42,220 కోట్లు ఉండగా… 2021-22 బడ్జెట్ నాటికి అది రూ.135,86,975. 52 కోట్లకు చేరింది. ఏడేళ్లలో 117 శాతం అప్పు పెరిగింది. 64 ఏళ్ళలో దేశం అప్పు…రూ. 62.42 లక్షల కోట్ల మేర ఉండగా గత ఏళ్లలోనే కొత్తగా..రూ.73,44,745 కోట్ల అప్పు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

1950 నుంచి 51 లో.. దేశ అంతర్గత అప్పు.. రెండు వేల కోట్లకు పైగా ఉండగా… విదేశీ అప్పు 32 కోట్లు ఉండేది. అయితే 2021 నాటికి అంతర్గత అప్పు..రూ.1,13,57,415 కోట్లు కాగా విదేశీ అప్పు నాలుగు లక్షలకు పైగా ఎగబాకింది. ఏడు దశాబ్దాల క్రితం చమురు మార్కెటింగ్ కంపెనీలు, ఎరువుల కంపెనీలు, ఎఫ్సీఐ కిరాయి కింద చెల్లించాల్సిన బకాయిలను ఏమీ లేవు. కానీ ఇప్పుడు ఆ రాయితీల భారం లక్షన్నర కోట్లకు పైగా చేరింది. ఇక కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయడంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.