మూడో వన్డేలో టీమిండియా చెత్త బ్యాటింగ్ కారణంగా… ఆస్ట్రేలియా జట్టు అవలీలగా విజయం సాధించింది. నిన్నటి మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 269 పరుగులు చేసింది. ఇక 270 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆది నుంచి… తడబడింది. విరాట్ కోహ్లీ మరియు హార్దిక్ పాండ్యా తప్ప అందరూ విఫలమయ్యారు.
దీంతో టీమిండియా 49.1 ఓవర్లలో 248 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఇక ఈ చివరి మ్యాచ్ లో ఓటమితో ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ కు మరో షాక్ తగిలింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. 113 రేటింగ్ పాయింట్లతో ఆసీస్ ఫస్ట్ ప్లేస్ కు చేరగా, భారత్ కూడా 113 పాయింట్లతో రెండవ స్థానానికి పడిపోయింది. ఇక టి20 లో భారత్ తొలి ప్లేస్ లో ఉండగా, టెస్టుల్లో 2వ స్థానంలో కొనసాగుతోంది.