విద్యార్థులకి ట్రంప్ షాక్.. స్పందించిన భారత్..!

-

అమెరికాలోని విదేశీ విద్యార్థుల పట్ల ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై భారత్ స్పందించింది. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు ఆన్‌ లైన్ క్లాసులు నిర్వహించేందుకు సిద్ధమైతే, విదేశీ విద్యార్థులు దేశం విడిచివెళ్లాలని అమెరికా పేర్కొంది. అంతేకాకుండా కొత్తగా విద్యార్థి వీసాలను జారీ చేయబోమని అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌ మెంట్(ఐసీఈ) స్పష్టం చేసింది.

అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది భారతీయ విద్యార్థులు ప్రభావితం అవుతారు. కాగా, తాజాగా.. దీనిపై భారత్ స్పందిస్తూ ‘ఇరు దేశాల మధ్య ఏర్పడ్డ సంబంధాల అభివృద్ధిల్లో విద్యా మార్పిడి పోషించిన పాత్రను దృష్టిలో పెట్టుకోవాలని’ అమెరికాకు సూచించింది. ఇప్పటికే హెచ్‌-1బీ వీసాలు, గ్రీన్‌కార్డుల జారీపై ట్రంప్ సర్కార్ నిషేధం విధించడంతో అమెరికాలో ఉన్న విదేశీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news