అమెరికాలో భయపడుతున్న భారతీయ విద్యార్ధులు…?

-

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత ప్రపంచానికి అమెరికా ఎన్నో పాటాలు చెప్పింది. వలసదారుల విషయంలో ట్రంప్ అనుసరించిన వైఖరి అనేక దేశాలకు చాలా సూచనలు ఇచ్చింది. అమెరికా అభివృద్దిలో స్థానికుల పాత్ర కంటే ఇతర దేశాల వారి పాత్రే ఎక్కువగా ఉంది. అమెరికా ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఐటి కంపెనీల్లో… ఇతర దేశాల వారే అధికంగా ఉన్నారు. అలాంటిది వారిని తమ దేశం నుంచి పంపిస్తామని ట్రంప్ ప్రతిజ్ఞ చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇక అక్కడి నుంచి అమెరికాలో అక్రమ వలసలు అంటూ చుక్కలు చూపించడం మొదలుపెట్టారు ట్రంప్. అయితే తాజాగా జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే ఆయన అమెరికాలో ఉన్న భారతీయులను ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నారని అంటున్నారు. అమెరికాలో భారతీయుల సంఖ్య దాదాపు 10 శాతం కి పైనే ఉంది. ఇక అక్కడ ఆదాయం ఎక్కువగా ఉండటంతో ఇక్కడి నుంచి యువత అక్కడికి వెళ్లి ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఈ నేపధ్యంలోనే అమెరికా… భారతీయ విద్యార్ధులు తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు అనే భావనలో ఉంది.

చాలా మంది విద్యార్ధులను అక్కడి నుంచి పంపించే ఆలోచనలో ఉందని అంటున్నారు. అక్రమ వలసదారుల పేరుతో గత నాలుగు నెలల్లో 600 మంది భారతీయులు భారత్ వచ్చేశారు. ఇప్పుడు మరికొంత మందిని అదే విధంగా తిప్పి పంపాలని భావిస్తుంది ట్రంప్ సర్కార్. భారతీయ విద్యార్ధులు ఎక్కువగా ఉండే 8 రాష్ట్రాల్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు సోదాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో విద్య పూర్తి కాక లేదా వచ్చి 5 ఏళ్ళు దాటి ఇంకా చదువుతున్న వారి మీద అమెరికా ఎక్కువగా దృష్టి పెట్టింది. త్వరలో 1200 మంది భారతీయ విద్యార్ధులను తిప్పి పంపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news