BRS కు అనుకూలంగా ఇండియా టీవీ సర్వే ఫలితాలు…!

-

తెలంగాణాలో నవంబర్ 30వ తేదీన ఎన్నికలు చాలా హోరాహోరీగా జరగనున్న విషయం తెలిసిందే. ఇక తెలంగాణాలో మూడు ముక్కలాట మరోసారి తప్పేలా లేదు.. అధికార BRS,కాంగ్రెస్ మరియు బీజేపీ ల మధ్యనే పోటీ ప్రధానంగా ఉన్నప్పటికీ, స్పష్టమైన పోరు మాత్రం BRS , కాంగ్రెస్ ల మధ్యనే ఉండనుంది. కాగా ఎన్నికలకు ముందు చాలా ప్రయివేట్ సంస్థలు సర్వే ల పేరుతో ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయని చెబుతూ ఉంటారు. ఇక తాజాగా ఇండియా టీవీ సర్వే ను చేపట్టి ఆ ఫలితాలను ఇప్పుడు ప్రకటించింది. ఈ ఫలితాల ప్రకారం అధికారంలో ఉన్న BRS మరోసారి విజయాన్ని సాధిస్తుందని అంచనా వేస్తోంది. ఈ ఎన్నికలలో BRS కు 70 సీట్లు, కాంగ్రెస్ కు 34 సీట్లు, బీజేపీ కి 7 సీట్లు మరియు ఎంఐఎం కు 7 సీట్లు వస్తాయని చెబుతోంది.

ఇక గత ఎన్నికలలో BRS ఏకంగా 88 సీట్లు దక్కించుకుని అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరి వాస్తవమైన ఎన్నికల ఫలితాలు ఏ విధంగా రానున్నాయి అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version