మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ.. పార్లమెంట్ లో రద్దు చేస్తూ బిల్లు పెట్టాలంటూ డిమాండ్ చేస్తూ.. నేడు హైదరాబాద్ లో మహాధర్నా జరుగనుంది. మరోవైపు రైతు ఉద్యమానికి నేటికి ఏడాది పూర్తి కావడంతో అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి(ఏఐకేఎంఎస్), సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) పిలుపు మేరకు ఇందిరా పార్క్ వద్ద ధర్నా జరగనుంది. ఈ కార్యక్రమానకి ముఖ్య అతిథిగా రైతు ఉద్యమ నాయకుడు రాకేష్ టికాయత్ రానున్నారు.
నేడు ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు ఈ మహాధర్నా జరుగనుంది. ఈ ధర్నాకు తెలంగాణ నుంచి రైతులు కదిలిరావాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుతో పాటు, మద్దతు ధర హామీ బిల్లును పార్లమెంటులో తీసుకురావాలని రైతుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మరో వైపు కేంద్రం రైతు బిల్లులను రద్దు చేసుకునే తీర్మాణాన్ని నిన్న క్యాబినెట్ భేటీలో ఆమోదించాయి. ఈనెల 29న ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. బిల్లు ఆమోదించే దాకా నిరసనలను కొనసాగిస్తామని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఆ తరువాతే ఇళ్లకు వెళ్తామని రైతులు స్పష్టం చేశారు.