థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన టోర్నీ ఫైనల్లో ఇండోనేషియాపై 3-0 తేడాతో భారత్ గెలుపొంది 73 ఏండ్ల తర్వాత థామస్ కప్ విజేతగా భారత్ నిలిచి భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించబడింది. 14 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇండోనేషియాను భారత్ ఓడించింది. అద్భుతమైన ఆటతో ఇండోనేషియాను భారత ఆటగాళ్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. థామస్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో మొత్తం రెండు డబుల్స్, మూడు సింగిల్ మ్యాచ్‌లు ఉండగా వరుసగా మూడింటిలోనూ భారత్ గెలుపొందింది.
మొదటగా ఆడిన సింగిల్స్ మ్యాచ్‌లో గింటింగ్‌పై 8-21, 21-17, 21-16 తేడాతో భారత ఆటగాడు లక్ష్యసేన్ విజయం సాధించాడు. అనంతరం ఆడిన పురుషుల డబుల్స్‌లో అసాన్, సంజయ జోడిపై భారత జోడి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన సింగిల్స్‌లో ఇండోనేషియా ఆటగాడు జొనాథన్ క్రిస్టీపై కిదాంబి శ్రీకాంత్ 21-15, 23-21 తేడాతో గెలుపొందడంతో స్వర్ణం వరించింది.