పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అది అధిక కొలెస్ట్రాల్ కు సంకేతమే..!

-

కొలెస్ట్రాల్ అనేది.. లావుగా ఉన్నవాళ్లకు మాత్రమే ఉంటుంది అనుకుంటారు.. అది అపోహ మాత్రమే.. సన్నగా కనిపించే వాళ్లకు కూడా కొలెస్ట్రాల్ అధికంగా ఉండే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అది గుండెకు ఎఫెక్ట్ అవుతుంది. దాని ద్వారా స్ట్రోక్ సమస్యలు వస్తాయి. అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి, మంచి ఆహారంతో పాటు, కొలెస్ట్రాల్‌ను ఎల్లవేలలా చెక్ చేసుకుంటూ ఉండాలి. తద్వారా కొలెస్ట్రాల్ సకాలంలో నియంత్రించుకోవచ్చు. పాదాలలో కనిపించే అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను కూడా తాజాగా నిపుణులు వెల్లడించారు. ఈ లక్షణాలను మాత్రం అస్సలు విస్మరించకూడదని హెచ్చరిస్తున్నారు.. మరి ఆ లక్షణాలు ఏంటో చూద్దామా..!

పాదాలలో అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు ఎలా ఉంటాయంటే?

కొలెస్ట్రాల్.. ప్రమాదకరమైన స్థాయికి చేరుకునే వరకు అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు సాధారణంగా కనిపించవు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిని గుర్తించడానికి రక్త పరీక్ష చేయవలసి ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, కొన్ని లక్షణాలు పాదాలలో కనిపించడం ప్రారంభవుతాయని ఒలియో లుస్సో మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మోనికా వాస్సెర్మాన్ తెలిపారు. ఎవరైనా వారి పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తే, వాటిని విస్మరించకూడదు. ఎందుకంటే ఈ లక్షణాలు శరీరంలో అధిక మొత్తంలో కొలెస్ట్రాల్‌ను సూచిస్తాయి. పాదాలు, కాలి వేళ్లు తిమ్మిరి, పసుపు గోర్లు కూడా అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతాలుగా నిలుస్తాయి. అంటే ధమనులు, రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్‌ పరిమాణం పెరిగిందనేదానికి సంకేతం.

అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు ఇవి కూడా కావొచ్చు..

ఛాతి నొప్పి
వికారం
దిగువ శరీరం చల్లగా ఉంటుంది
తరచుగా శ్వాస ఆడకపోవడం
అలసినట్లు అనిపించడం
రక్తపోటులో పెరుగుదల

శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అధిక కొలెస్ట్రాల్‌కు గురయ్యే వ్యక్తులు రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం, వండిన ఆహారం, వేయించిన ఆహారం తీసుకోకూడదు.. ఆయిల్ ఫిష్ (మాకేరెల్, సాల్మన్), బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్, బ్రౌన్ పాస్తా, నట్స్, గింజలు, పండ్లు, కూరగాయలు ఆహారంలో తీసుకోవాలి.

ఆరోగ్యకరమైన వ్యక్తికి కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి..

మొత్తం కొలెస్ట్రాల్: 200 కంటే తక్కువ – 239 mg/dL

HDL: 60 mg/dL కంటే ఎక్కువ

LDL: 100 mg/dL కంటే తక్కువ

Read more RELATED
Recommended to you

Latest news